Breaking News

డిసిహెచ్‌య‌స్‌ల ప‌నితీరు పెంచేందుకు శిక్ష‌ణ‌

-మంగ‌ళ‌వారం నుంచి నాలుగు రోజుల స‌మ‌గ్ర శిక్ష‌ణ
-రాష్ట్ర విభ‌జ‌నానంత‌రం మొట్ట‌మొద‌టి శిక్ష‌ణా కార్య‌క్ర‌మం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని 26 జిల్లాల ఆరోగ్య సేవ‌ల స‌మ‌న్వ‌యాధికారుల (డిసిహెచ్‌య‌స్‌లు) ప‌నితీరు మెరుగుప‌రిచేందుకు ఈనెల 8 నుండి నాలుగు రోజుల పాటు స‌మ‌గ్ర శిక్ష‌ణా శిబిరాన్ని నిర్వ‌హించనున్నారు. ఆయా జిల్లాల్లోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సిహెచ్‌సిలు), జిల్లా మ‌రియు ప్రాంతీయా ఆసుప‌త్రులు అందించే సేవ‌ల‌ను డిసిహెచ్‌య‌స్‌లు ప‌ర్య‌వేక్షిస్తారు. రాష్ట్రంలో మొత్తం 242 సెకండ‌రీ ఆసుప‌త్రులున్నాయి.

ఇటీవ‌ల వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశంలో జిల్లాస్థాయి అధికారులైన డియంహెచ్వోలు, డిసిహెచ్‌య‌స్‌ల పనితీరుపై ఆందోళ‌న వెలిబుచ్చారు. పాల‌నా విష‌యాల‌కు సంబంధించి వీరిలో అవ‌గాహ‌నాలోపం, ప‌ర్య‌వేక్ష‌ణా విధుల్లో వైఫ‌ల్యాల కార‌ణంగా వివిధ ఆరోగ్య ప‌థ‌కాల అమ‌లు,వైద్య సేవ‌ల నాణ్య‌త‌లో లోపాలు, పాల‌నాప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ని, జిల్లా స్థాయి అధికారుల‌కు త‌గు శిక్ష‌ణ ఇవ్వాల‌ని మంత్రి సూచించారు. ఈ నేప‌థ్యంలో సెకండ‌రీ హెల్త్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎ.సిరి డిసిహెచ్‌య‌స్‌ల‌కు నాలుగు రోజుల శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు.

ప‌రిపాల‌న‌, విజిలెన్స్, న్యాయ‌ప‌ర‌మైన అంశాల ప‌రిష్కారం, వివిధ ప‌థ‌కాల అమ‌లులో ఎదుర‌య్యే క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌లు మ‌రియు ల‌క్ష్యాలు, డిడిఓల బాధ్య‌త‌లు, అవినీతిని అడ్డుకోవ‌డం, ఆడిట్ మ‌రియు బ‌డ్జెట్ విష‌యాలు, ట్రెజ‌రీ కోడ్‌లు, డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ‌ల అమ‌లు, డాక్ట‌ర్లు, న‌ర్సులు, రోగుల మ‌ధ్య సంబంధాలు, ఎఫ్ఆర్ య‌స్ హాజ‌ర‌లు వంటి ప్ర‌ధాన విష‌యాల్లో శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు.

రాష్ట్ర విభ‌జ‌నానంత‌రం డిసిహెచ్‌య‌స్‌ల‌కు ఈ విధ‌మైన శిక్ష‌ణ ఇవ్వ‌డం ఇదే మొద‌టిసారి అని డియ‌స్‌హెచ్ డాక్ట‌ర్ సిరి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *