Breaking News

గవర్నర్ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 10వ తేదీన జిల్లాలో రాష్ట్ర గవర్నర్ పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం 6 వ స్నాతకోత్సవం ఈనెల 10వ తేదీన ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణ భారత్ ట్రస్టులో జరగనున్న నేపథ్యంలో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, సంయుక్త కలెక్షన్ గీతాంజలి శర్మతో కలిసి ఆ ట్రస్టు ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ స్వర్ణ భారత్ ట్రస్టులో ప్రవేశించగానే ఎదురుగా ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి గౌరవ రాష్ట్ర గవర్నర్ పూలమాల వేస్తారని, ఆ విగ్రహం చుట్టూ పరిశుభ్రంగా ఉంచాలని, పూలతో సుందరంగా అలంకరించాలని సూచించారు ప్రవేశ మార్గంలో పందిళ్లు, మొక్కల కుండీలు, కార్పెట్ తదితర ఏర్పాట్లు సజావుగా చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ఒక వ్యక్తిని ఒక అధికారికి బాధ్యత అప్పగించాలని జిల్లా కలెక్టర్ విశ్వవిద్యాలయం డీన్ కు సూచించారు. విజయవాడ నుంచి స్వర్ణ భారత్ ట్రస్ట్ కు వచ్చే మార్గంలో రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. గవర్నర్ కోసం గ్రీన్ రూమ్ లో సోఫా, మంచి విద్యుత్ దీపాలతో మంచినీరు, తేనీరు తదితర వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా మందిరంలో జరిగే కార్యక్రమానికి ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించాలని, వేదికను సుందరంగా అలంకరించాలని, వేదిక పైన ఇరువైపులా పోడియంలు ఏర్పాటు చేయాలన్నారు.

ప్రజా మందిరంలో సీటింగ్ ఏర్పాట్లు, అలంకరణ ఈనెల 9వ తేదీ ఉదయానికి పూర్తి చేయాలన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం ప్రత్యక్ష ప్రసారం తదితర ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతున్న దృష్ట్యా అంతకు ముందుగానే విద్యార్థులందరూ వారికి కేటాయించిన సీట్లలో ముందుగానే కూర్చునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వేదికకు ఎదురుగా ఉన్న ప్రదేశంలో గవర్నర్ తో పాటు బంగారు పతక విజేతలు, డిగ్రీ పొందే విద్యార్థుల గ్రూప్ ఫోటో కు అన్ని ఏర్పాట్లు సజావుగా చేయాలన్నారు. ట్రస్టు లోపల, బయట చుట్టుపక్కల చెత్తాచెదారాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈనెల 10 వ తేదీన గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ గారు స్వర్ణ భారత్ ట్రస్టులో జరుగుతున్న వైయస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం 6 వ స్నాతకోత్సవంలో పాల్గొంటున్నారన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. గవర్నర్ ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమం సజావుగా నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వెంట విశ్వవిద్యాలయం డీన్ ప్రసన్నకుమార్, . అసోసియేటెడ్ డీన్ దొరాజీరావు, గుడివాడ ఆర్డీవో జి బాలసుబ్రమణ్యం, మెప్మా పీడీ సాయిబాబు, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, డిపిఓ జే అరుణ, ఉద్యాన అధికారి జే.జ్యోతి, డీఎంహెచ్వో డాక్టర్ శర్మిష్ఠ ,సి పి డి సి ఎల్ ఎస్ ఇ సత్యానందం, జిల్లా ఆహార భద్రత అధికారి గోపాలకృష్ణ, ప్రొఫెసర్ ఉమా కృష్ణ, డీఎస్పీ శ్రీనివాసరావు, ట్రస్ట్ ఇన్చార్జి పరదేశి, అగ్నిమాపక అధికారి అహ్మద్, ఎం వి ఐ సుబ్బారావు తదితర అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *