Breaking News

క్యాంపు కార్యాల‌యంలో చేతి క‌ర్ర‌లు పంపిణీ చేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప‌క్ష‌వాతంతో న‌డ‌వ‌లేక ఇబ్బంది ప‌డుతున్న ఇద్ద‌రు బాధితుల‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం గ‌ణ‌ప‌తి రావు రోడ్డు లో గ‌ల ఎంపీ క్యాంపు కార్యాల‌యంలో బుధ‌వారం చేతి క‌ర్ర‌లు పంపిణీ చేశారు. ప‌క్ష‌వాతానికి గురైన 51 వ డివిజ‌న్ కి చెందిన‌ పొలుసు నాని , 47వ డివిజ‌న్ కి చెందిన ఎరుప‌ల్లి నారాయ‌ణ‌మ్మల‌కు చేతి కర్ర‌లు ఎంపీ కేశినేని శివ‌నాథ్ అంద‌జేశారు. ప‌క్ష‌వాతంతో బాధ‌ప‌డుతూ రాలేకపోయిన‌ ఎరుప‌ల్లి నారాయ‌ణ‌మ్మ త‌రుఫున ఆమె భ‌ర్త రామారావు కి చేతి క‌ర్ర అంద‌జేయ‌టం జ‌రిగింది. పేద ప్ర‌జ‌ల‌కు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండ‌గా వుంటుంద‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మైనార్టీ సెల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఫ‌తావుల్లా, తెలుగు యువ‌త నియోజ‌క‌వ‌ర్గ అధ్య‌క్షుడు ఆర్.మాధ‌వ‌, క్లస్టర్ ఇంచార్జి సుఖాసీ కిరణ్ , 51వ డివిజ‌న్ పార్టీ ప్రెసిడెంట్ కుంచం దుర్గారావు 47వ డివిజ‌న్ పార్టీ ప్రెసిడెంట్ నాగోతి రామారావు ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *