-దివ్యాంగుల స్వర్ణాంధ్ర క్రికెట్ కప్ -2025 పోస్టర్ ఆవిష్కరించిన ఏసీఏ అధ్యక్షుడు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుల అభివృద్ది కోసం ఏసీఏ అన్ని విధాలుగా ప్రోత్సాహించటంతో పాటు అండగా నిలబడుతుందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగుల కొరకు నిర్వహించనున్న స్వర్ణాంధ్ర ఇంటర్ డిస్ట్రిక్ జోనల్ ఇన్ క్లూజివ్ క్రికెట్ కప్ -2025 పోస్టర్ ను , ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్లీ ఎబెల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ యడ్లవల్లి సూర్యనారాయణతో కలిసి బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్లీ ఎబెల్డ్ క్రికెట్ కమిటీ దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారులకు నిర్వహించే స్వర్ణాంధ్ర ఇంటర్ డిస్ట్రిక్ జోనల్ ఇన్ క్లూజివ్ క్రికెట్ కప్ -2025 టోర్నమెంట్ ను జోన్ ల వారీగా ఆగస్టు నుంచి ప్రారంభిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ కి డిఫరెంట్లీ ఎబెల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ యడ్లవల్లి సూర్యనారాయణ వివరించారు. గుంటూరు లో జరిగే సెంట్రల్ జోన్ టోర్నమెంట్ ఆగస్టు 8వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు, శ్రీకాకుళంలో జరిగే నార్త్ జోన్ టోర్నమెంట్ ఆగస్టు 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు, అనంతపుర్ లో జరిగే సౌత్ జోన్ టోర్నమెంట్ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు జరుగుతాయని. చివరగా విజయవాడలో స్వర్ణాంధ్ర ఇంటర్ డిస్ట్రిక్ జోనల్ ఇన్ క్లూజివ్ క్రికెట్ కప్ -2025 టోర్నమెంట్ జరుగుతుందని సూర్యనారాయణ ఎంపీ కేశినేని శివనాథ్ కి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఫరెంట్లీ ఎబెల్డ్ క్రికెట్ కౌన్సిల్ సభ్యుడు కొండా సత్యవరప్రసాద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News