విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
10వ నేషనల్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్ షిప్-2025 పోస్టర్ ను ఏసీఏ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఆవిష్కరించారు. ది కృష్ణ డిస్ట్రిక్ టైక్వాండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ సహకారంతో 10వ నేషనల్ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్ షిప్ కాంపిటీషన్స్ జూలై 25 నుంచి జూలై 27 వరకు పటమట హైస్కూల్ రోడ్డులో గల చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ కు అసోసియేషన్ సెక్రటరీ ఎల్.శివ భాస్కర్ వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్, కార్యవర్గ సభ్యులు వి. రాము, పి.సంపత్, ఎస్. రంజిత్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News