గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీలు రీ ఓపెన్ కాకుండా, ప్రజలు సంతృప్తి చెందేలా నిర్దేశిత గడువులోగా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్,డిప్యూటీ కమిషనర్ల చాంబర్లలో పిజిఆర్ఎస్ ను అదనపు కమిషనర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 11 ఫిర్యాదులు తీసుకొని, అధికారులతో మాట్లాడుతూ డయల్ యువర్ కమిషనర్ కి అందిన ఆర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ చాంబర్ కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
అనంతరం జిఎంసి పార్కింగ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని అదనపు కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలన్నారు. అర్జీలు బియండ్ ఎస్ఎల్ఏ లోకి వెళ్లడానికి వీలులేదన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు ఆర్జీలను నేరుగా వెళ్లి పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రజల నుండి అందే అర్జీలు, ఫిర్యాదుల నమోదుకి ప్రతి విభాగంలో సూపరిండెంట్ ఆధ్వర్యంలో సిబ్బందిని కేటాయించి, ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేయాలన్నారు. పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు.
పిజిఆర్ఎస్ ద్వారా మొత్తం 19 ఫిర్యాదులు అందాయని, పట్టణ ప్రణాళిక విభాగం 3, ఇంజినీరింగ్ విభాగం 9, రెవెన్యూ విభాగం 3, ప్రజారోగ్య విభాగం 3, ఉపా సెల్ విభాగానికి సంబందించి 1 ఫిర్యాదు అందాయన్నారు. పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందిన ఆర్జీలను విభాగాల వారిగా విబజించి, సంబంధిత విభాగాదిపతులకి పంపి సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లుడి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, బి.శ్రీనివాసరావు, సిపి రాంబాబు, ఈఈలు సుందర్రామిరెడ్డి, కోటేశ్వరరావు, ఎంహెచ్ఓ(ఇంచార్జి)లు రామారావు, సోమశేఖర్, మేనేజర్ బాలాజీ బాష పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News