Breaking News

ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ చేయడానికే సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లో కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి అనేదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని అందుకే సచివాలయ,వాలంటర్ వ్యవస్థ లు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలనను సుసాధ్యం చేసారని, నేడు ప్రజలకు ప్రభుత్వన్ని మరింత చేరువ చేయడానికి, అర్హులైన లబ్ధిదారులకు నష్టం జరగకూడదు అని సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమం చేపట్టినట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శుక్రవారం తూర్పు నియోజకవర్గంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఆయా డివిజిన్ల కార్పొరేటర్ లు,సచివాలయ సిబ్బంది తో కలిసి ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పధకాల అమలు, వాలంటీర్ ల పనితీరు గురుంచి ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధముగా జగన్ వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత జవాబుదారీతనం గా వుంటున్నారని, ప్రభుత్వ అధికారులను వారి వద్దకే పంపి వారి సమస్యలను పరిష్కరించడం గొప్ప విషయమని కొనియాడారు. ఇకనుండి నెలలో రెండు రోజులు శుక్రవారం, శనివారం సచివాలయ సిబ్బంది వారి పరిధిలోని ప్రతి కుటుంబాన్ని కలిసి పధకాల అమలు తీరు గురుంచి తెలుసుకోవడమే కాకుండా వారి స్పందనను రికార్డ్ చేయాలని ,తూర్పు నియోజకవర్గంలో సచివాలయ సిబ్బంది తో పాటు ఆయా డివిజిన్ల కార్పొరేటర్ లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

మెగా వ్యాక్సినేషన్ కు విశేష స్పందన : దేవినేని అవినాష్ 
కరోనా ముప్పు ఇంకా తొలగలేదని ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రభుత్వం చేపట్టిన మెగా వ్యాక్షినేషన్ డ్రైవ్ ను తూర్పు నియోజకవర్గంలో పర్యవేక్షించిన అవినాష్ వ్యాక్షినేషన్ జరుగుతున్న తీరును వైద్య సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ పట్ల అపోహలు విడనాడి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలనీ అన్నారు. తూర్పు నియోజకవర్గలో కోవిడ్ – 19 మెగా వ్యాక్సినేషన్ కు విశేష స్పందన లభించింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ కార్పొరేటర్ చింతల సాంబయ్య, వైసీపీ నాయకులు ఆళ్ల చల్లారావు,శేటికం దుర్గాప్రసాద్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *