Breaking News

నిరుపేదల అండగా వైసీపీ ప్రభుత్వ పాలన… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ కి చెందిన యం. హిమ శ్రీ కి బోన్ మ్యారో ట్రాన్సప్లాంట్ వైద్య చికిత్స కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి (LOC) ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు కాగా నేడు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వారి కుటుంబ సభ్యులకు అందజేసిన తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా నిరుపేదలు ఎవరు ఇబ్బందులు పడకూడదు అని ఆరోగ్య శ్రీ వర్తించని వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేసి పేదలకు జగన్  అండగా నిలుస్తున్నారు పేదరికంతో ఏ ఒక్కరు ఉండకూడదనే ఉద్దేశంతో వారందరికీ సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు కట్టించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్  శ్రీకారం చుట్టారు అని అన్నారు.ఆపత్కాల సమయంలో కూడా నిరుపేదల సంక్షేమం కొరకు వారికి అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకొంటున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *