విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ కి చెందిన యం. హిమ శ్రీ కి బోన్ మ్యారో ట్రాన్సప్లాంట్ వైద్య చికిత్స కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి (LOC) ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు కాగా నేడు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వారి కుటుంబ సభ్యులకు అందజేసిన తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా నిరుపేదలు ఎవరు ఇబ్బందులు పడకూడదు అని ఆరోగ్య శ్రీ వర్తించని వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేసి పేదలకు జగన్ అండగా నిలుస్తున్నారు పేదరికంతో ఏ ఒక్కరు ఉండకూడదనే ఉద్దేశంతో వారందరికీ సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు కట్టించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు అని అన్నారు.ఆపత్కాల సమయంలో కూడా నిరుపేదల సంక్షేమం కొరకు వారికి అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకొంటున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News