-జిల్లాలో ఎస్ హెచ్ జి మహిళల అకౌంటు పుస్తకాలు ఎప్పటికప్పుడు వ్రాయించి అవకతవకలు జరగకుండా చూడాలి :జిల్లా కలెక్టర్ డా ఎస్.వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఇంట్లో ఒక మహిళ ఎంటర్ ప్రెన్యూర్ కావాలన్నదే మన రాష్ట్ర ప్రభుత్వ ద్యేయం అని, జిల్లాలో ఎస్ హెచ్ జి మహిళల అకౌంటు పుస్తకాలు ఎప్పటికప్పుడు వ్రాయించి అవకతవకలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డా ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు.
గురువారం తిరుపతిలోని హోటల్ Orchid నందు ఎంటర్ ప్రెన్యూర్స్ గురించి మూడు రోజుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమమునకు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ హాజరై మాట్లాడుతూ .. ప్రతి సంఘంలో లీడర్ షిప్ మార్పులు రావాలని, సభ్యులందరూ కూర్చొని వారి యొక్క జీవనోపాదుల ప్రణాళిక తయారు చేసుకోనేటట్లు సిబ్బంది పని చేయాలని తెలియజేశారు. విమెన్ ఎంటర్ ప్రెన్యూర్ పైన ఫోకస్ చెయ్యాలని తెలియజేశారు.వెలుగు పథకం 25 సం.లు పూర్తి చేసుకున్నట్లు దేశంలో ఏ పథకం ఇంత సుదీర్ఘంగా కొనసాగలేదని సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రూపుగా చేపట్టాల్సిన కార్యక్రమాల పైన అవగాహన కల్పించి కార్యక్రమాలు చేయాలన్నారు. డి.ఆర్.డి.ఎ. ద్వారా అమలు చేసే కార్యక్రమాలలో ఫైనాన్షియల్ లిటరిసి పై అవగాహన లోపాలను అంటే వారు తయారు చేసే ఉత్పత్తులపై విక్రయించే ఫ్లాట్ ఫార్మ్ లను కూడా తెలియజేయాలన్నారు.
ఈ సమావేశానికి డిఆర్ డిఏ పథక సంచాలకులు శోభన్ బాబు, డిఆర్ డిఏ అదనపు పథక సంచాలకులు, మరియు సిబ్బంది హాజరయ్యారు.
Prajavartha Online Telugu News