గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళగిరిలోని సీకే కన్వన్షన్ హాల్ లో ఈ నెల 2 వ తేదిన జరిగే రాష్ట్రంలోని జాతీయ రహదారి ప్రాజెక్టుల శంకుస్థాపన మరియు జాతికి అంకితం చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తో కలసి పాల్గొననున్న నేపధ్యంలో అక్కడి ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ , సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ , నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్ టి. పార్వతీశం తో కలసి పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించి ట్రాఫిక్ క్రమబద్దీకరణ , వాహనాల పార్కింగ్, భద్రత ఏర్పాట్లు , సభా వేదిక , సీటింగ్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించి సూచనలు అందజేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఆర్డిఓ కే.శ్రీనివాస రావు , డిఎస్పీలు మురళి కృష్ణ, ఎం.రాము , డిటీసీ కె.సీతారామి రెడ్డి , ఫైర్ ఆఫీసర్ వై. వెంకటేశ్వర్లు ,ఏపిసిపిడిసిఎల్ ( ఎలక్ట్రికల్ ) ఏ.ఈ జి.మల్లిఖార్జున , ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎస్. రవీంద్ర రెడ్డి , యంటీయంసీ డిప్యూటీ కమిషనర్ బి. శ్రీకాంత్ , మంగళగిరి తహశీల్దార్ కె.దినేష్ , గుంటూరు పశ్చిమ మండల తహశీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News