విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగష్టు నెల 2,3 తేదీలలో గుంటూరు జిల్లా గ్రామీణ విలేఖరులకు పునశ్చరణ తరగతులను సి. ఆర్. మీడియా అకాడమి నిర్వహిస్తున్నదనీ ఈ కార్యక్రమాన్ని గ్రామీణ విలేఖరులు సద్వినియోగం చేసుకోవాలని సి. ఆర్. మీడియా అకాడమి చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పునశ్చరణ తరగతులు తెనాలి, తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆగష్టు 2,3 తేదీలలో జరుగుతాయి. ఈ కార్యక్రమం శనివారం (2.8.25) ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. సభా కార్యక్రమం అనంతరం తరగతులు ప్రారంభం అవుతాయి. 2 రోజుల కార్యక్రమంలో తొలి రోజున “సోషల్ మీడియా యుగంలో మీడియా పాత్ర; జర్నలిజంలో నైతిక నిష్ఠ; మీడియాలో నూతన ధోరణులు” అనే అంశాలపైన తదుపరి 2వ రోజున “విలేఖరుల నుంచి డెస్క్ ఏం కోరుకుంటుంది; గ్రామీణ వార్తలు, కథనాలు; పత్రికా భాషలో మెళకువలు; స్మార్ట్ రిపోర్టింగ్” అనే అంశాలపై సీనియర్ జర్నలిస్టులు శిక్షణ ఇస్తారని చైర్మన్ తెలియజేశారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News