తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈ రోజు తిరుపతి అర్బన్ కొర్లగుంట నందలి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల నందు నేషనల్ డీ వార్మింగ్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్ విద్యార్థిని విద్యార్ధులకు ఆల్ బెండజోల్ మాత్రలు మింగించారు. ఈ సందర్బంగా వారు ప్రసంగిస్తు జిల్లా లో 1 నుండి 19 సంవత్సరాలు వయసు కలిగిన వ 4,97, 511 మంది విద్యార్థులకు ఈ రోజు కడుపు లో ప్రేవుల లో ఉన్న నులి పురుగులు నిర్మూలన కై ఆల్బండజోలు మాత్రలు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. విద్యార్థులలో రక్తహీనతను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. చిన్నారులలో నులిపురుగుల వలన వచ్చే అనర్థాలు వివరించారు. అలాగే ఈరోజు గైర్హాజరైన పిల్లలకు ఆగష్ట్ 20 వ తారీఖున మాప్ అప్ డే రోజున ఆల్బెండజోల్ మాత్రలు ఇస్తారని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాల కృష్ణ నాయక్ మాట్లాడుతూ ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఆల్బెండజోల్ మందు బిళ్ళలను మింగించడం అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల యందు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, స్కూల్ టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు రక్తహీనత గురించి, పర్సనల్ హ్యాండ్ వాషింగ్ గురించి నులిపురుగుల నివారణ గురించి అలాగే బహిరంగ మల విసర్జన చేయరాదని అందరూ కూడా టాయిలెట్స్ వాడుకోవాలని తదితర విషయాలు పై ఆరోగ్య విద్య బోధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి ఇ ఓ కుమార్, ప్రోగ్రాం స్టేట్ నోడల్ ఆఫీసర్స్ డాక్టర్ శ్రీనివాస వర్మ, డాక్టర్ సౌజన్య లక్ష్మి, డిపిఎమ్ఓ డాక్టర్ శ్రీనివాసరావ్, ఆర్బిఎస్కే ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రెడ్డి ప్రసాద్, , యుపి హెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సింధు డిప్యూటీ డెమో లు కిరణ్ కుమార్, ఖాజా వలి, లు RBSK మేనేజర్ గుణశేఖర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రవి ఇతర ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Prajavartha Online Telugu News