Breaking News

IEC ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాలయం ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారి వారి ఆధ్వర్యంలో ఈ రోజు IEC ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ ప్రారంభించి మహమ్మారి హెచ్ఐవి ఎయిడ్స్ పై మరియు మాధకద్రవ్య వ్యసనాలపై యువతకు అవగాహన నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. DM & HO డాక్టర్ బాలకృష్ణ నాయక్ ర్యాలీ లో పాల్గొని, IEC కాంపెయిన్ యొక్క పోస్టర్ లను ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు తిరుపతి జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారి డాక్టర్ శైలజ మాట్లాడుతూ హెచ్ఐవి పై ప్రతి ఒక్కరికి అవగాహన కావాలని వారి పట్ల ఎలాంటి వివక్షత చూపరాదని చెప్పడం జరిగింది. క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ కోటి రెడ్డి మాట్లాడుతూ యువత కి హెచ్ఐవి/ఎయిడ్స్ మరియు మత్తు పదార్థాలకు బానిసలై సన్నిహితులతో కలిసి సిగరెట్టు, మందుకు అలవాటై, అలా గంజాయి వరకు కూడా వ్యసనాలకు బానిసలై జీవితం విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. యువతకు హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహనతో పాటు ప్రతి కాలేజీలో కూడా కౌన్సిలింగ్ కార్యక్రమలు నిర్వహించడం చాలా మంచిదని , హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ చట్టం 2017 యాక్ట్ గూర్చి క్లుప్తంగా వివరించడం జరిగింది, ఈ IEC ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ కార్యక్రమములో బాగంగా జిల్లా వైద్య శాఖ కార్యాలయం నుండి స్విమ్స్ సర్కిల్‌ వరకు ర్యాలీకి నిర్వహించటం జరిగింది. ర్యాలీ లో మెడికల్ సిబ్బంది, యువత, నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, స్వచ్చంద సేవ సంస్థల సిబ్బంది మరియు లింక్ వర్కర్ స్కీం సిబ్బంది, CSC, SHARE INDIA, సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈకార్య క్రమం లో ఇంకా డాక్టర్ శ్రీనివాసరావ్ ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *