గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
హింస గురైన మహిళల సంరక్షణ కోసం సఖి వన్ స్టాప్ సెంటర్ ను బాధిత మహిళలు వినియోగించుకోవాలని జిల్లా శ్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పొన్నూరు ప్రసూన కోరారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పలు విషయాలను పంచుకున్నారు. మహిళలు ఎటువంటి హింసకు గురైన తమకు సమాచారం అందిస్తే వెంటనే వారికి రక్షణ కల్పించి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఐదు రోజులపాటు వారి కి వసతిని కల్పించి ,వారి జీవనాభివృద్ధికి స్కిల్ సెంటర్ ద్వారా అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలియజేశారు .అంతేకాకుండా వారికి పలు అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. హింసకు గురైన మహిళలకు పోలీసు శాఖ ద్వారా సహకారాన్ని అందిస్తామని వెల్లడించారు. అదేవిధంగా బాధితురాలితో పాటు ఆమె తొమ్మిదేళ్ల లోపు బాబుకు షెల్టరు ఇస్తామన్నారు. బాధితురాలి కి ఆడపిల్ల ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఆశ్రయమిస్తామని వెల్లడించారు. 2016లో ఈ సెంటర్ ప్రారంభం అయిందన్నారు .ఇప్పటివరకు 1247 మందికి ఆశ్రయం కల్పించి కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. ఈ సెంటర్ నిర్వహణకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారని తెలియజేశారు .జిల్లాకు ఒక కేంద్రం మాత్రమే ఉంటుందని తెలిపారు .ఎవరైనా బాధితులు ఉంటే 9440814511 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. వారికి న్యాయపరమైన సహాయాన్ని కూడా అందిస్తామని వెల్లడించారు. కుల మతాలకు అతీతంగా బాధిత మహిళలకు సహకారం ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ కె శాంతి భూషణ గోపి కూడా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News