Breaking News

30 ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల సొంత భ‌వ‌నాల నిర్మాణం

-రూ.30 కోట్ల వ్య‌యంతో ఆమోదించిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
అద్దెభ‌వ‌నాల్లో సేవ‌లందిస్తున్న 30 పట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌కు(యుపిహెచ్‌సిలు) సొంత భ‌వ‌నాల నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఒక్కో నూత‌న భ‌వ‌నానికి రూ.1 కోటి చొప్పున మొత్తం రూ.30 కోట్ల వ్య‌యంతో ఈ నిర్మాణ ప‌నుల్ని చేప‌ట్టడానికి వైద్యారోగ్య శాఖా మంత్రి  స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆమోదం తెలిపారు.

స‌మీక్షానంత‌ర నిర్ణ‌యం
రాష్ట్రంలో మొత్తం 560 ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు సేవ‌లందిస్తున్నాయి. వీటి వ‌స‌తికి సంబంధించిన విష‌యాన్ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించి ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. మొత్తం 560 కేంద్రాల్లో 175 మునిసిప‌ల్ భ‌వ‌నాల్లో కొన‌సాగుతున్నాయి. మ‌రో 293 సొంత భ‌వ‌నాల్లో ప‌నిచేస్తున్నాయి. నిర్మాణంలో ఉన్న మ‌రో 62 భ‌వ‌నాలు ఈ ఏడాది చివ‌రికి పూర్త‌వుతాయి. మిగిలిన 30 కేంద్రాల‌కు సొంత భ‌వ‌నాల‌ను ఏర్పాటు చేసేందుకు రూ.30 కోట్ల వ్య‌యానికి మంత్రి ఆమోదం తెలిపారు. ఈ ప‌నులు పూర్త‌య్యే స‌రికి మొత్తం 560 ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు ప్ర‌భుత్వ భ‌వ‌నాల నుంచే సేవ‌లందిస్తాయి.

విశాఖ‌ప‌ట్నంలో 4 కొత్త భ‌వ‌నాలు
మంత్రి ఆమోదంతో రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లో 30 యుపిహెచ్‌సిల‌కు నూత‌న భ‌వ‌నాలు నిర్మిస్తారు. ఇందులో విశాఖ‌ప‌ట్నం న‌గ‌రంలో 4 నూత‌న భ‌వ‌నాల నిర్మాణం జ‌రుగుతుంది. ఏలూరు జిల్లాలో 3(ఏలూరు, జంగారెడ్డి గూడెం, చింత‌ప‌ల్లి), అనంత‌పురం జిల్లాలో 2(అనంత‌పురం, గుత్తి), క‌డ‌ప జిల్లాలో 2(క‌డ‌ప, బ‌ద్వేల్‌) చోట్ల కొత్త భ‌వ‌నాల నిర్మాణాన్ని చేప‌డ‌తారు. వీటితో పాటు బొబ్బిలి, త‌ణుకు, విజ‌య‌వాడ‌, గొల్ల‌ప్రోలు( కాకినాడ జిల్లా) విజ‌య‌వాడ‌,కానూరు, గుంటూరు, చిల‌క‌లూరిపేట‌, పొదిలి, కుప్పంల‌లో యుపిహెచ్‌సిల‌కు నూత‌న సొంత భ‌వ‌నాలు ఏర్ప‌డ‌నున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *