Breaking News

ఆశా వర్క‌ర్ల‌కు గ్రాట్యుటీ మంజూరు

-రూ.645 కోట్ల మేర‌కు ల‌బ్దిపొంద‌నున్న ఆశాలు
-దేశంలోనే ఆశాల‌కు గ్రాట్యుటీ చెల్లిస్తున్న మొద‌టి రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
-ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
దీర్ఘ కాలంగా ఆశా వ‌ర్క‌ర్లు చేస్తున్న కొన్ని ప్ర‌ధాన డిమాండ్ల‌ను అంగీక‌రిస్తూ రాష్ట్ర‌ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారంనాడు ఆదేశాలు జారీ చేసింది. వారికి గ్రాట్యుటీ చెల్లించ‌డంతో పాటు 6 నెల‌ల పాటు ప్ర‌సూతి సెల‌వుల మంజూరు మ‌రియు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 62 సంవ‌త్స‌రాల‌కు పెంచ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అంగీక‌రించింది.

ఆరోగ్య సేవ‌కుల‌కు గ్రాట్యుటీ చెల్లిస్తున్న మొద‌టి రాష్ట్రం
ఆశాలు ప‌నిచేసిన కాలానికి సంవ‌త్స‌రానికి రూ.5,000 చొప్పున గ‌రిష్టంగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే ప్ర‌తి ఆశాకు రూ.1, 50,000 చెల్లించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం అంగీక‌రించింది. రాష్ట్ర వ్యాప్తంగా 43,000 మంది ఆశా వ‌ర్క‌ర్లు గ్రామ స్థాయిలో వివిధ వైద్యారోగ్య ప‌థ‌కాల కింద సేవ‌లందిస్తున్నారు. ప్ర‌భుత్వ అంగీకారం మేర‌కు వీరంద‌రికీ గ్రాట్యుటీ చెల్లించ‌డానికి మొత్తం రూ.645 కోట్లు ఖ‌ర్చ‌వుతుంది. ఆశాల‌కు ఈ విధంగా గ్రాట్యుటీ చెల్లిస్తున్న మొద‌టి రాష్ట్రంగా ఆంధ్రప్ర‌దేశ్ నిలుస్తుంద‌ని ఉన్న‌తాధికారులు తెలియ‌జేశారు.

ప్ర‌భుత్వం ఆమోదించిన ఇత‌ర డిమాండ్లు
ఒక్కో ప్ర‌స‌వానికి 6 నెల‌లు చొప్పున మొద‌టి 2 ప్ర‌స‌వాల‌కు వేత‌నాల‌తో కూడిన సెల‌వు మంజూరు చేయ‌డానికి కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం అంగీక‌రించింది. దీంతోపాటు ఆరోగ్య స‌హాయ‌కుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును ప్ర‌స్తుత 60 ఏళ్ల‌నుండి 62 ఏళ్ల‌కు పెంచ‌డానికి రాష్ట్ర‌ప్ర‌భుత్వం స‌మ్మ‌తించింద‌ని తెలియ‌జేస్తూ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు నేడు ఆదేశాల‌ను జారీ చేశారు.

ఆర్ధిక భారంతో కూడిన‌ప్ప‌టికీ ఆశా వ‌ర్క‌ర్ల ప్ర‌ధాన డిమాండ్ల‌ను ఆమోదించినందుకు ముఖ్య‌మంత్రి  నారా చంద్ర‌బాబు నాయుడుకు వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *