-ఆర్టీసి ఆస్తులను లులూ షాఫింగు మాల్ కి ఇచ్చే జిఓ 137 రద్దుచేయాలి
-ఆర్టీసి ఉద్యోలకు ఐదేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతలకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి
-ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఇంకా జాప్యం జరిగితే ఉద్యోగుల అభిప్రాయాలతో ఏకీభవిస్తూ ఉద్యమాలకు సిద్దపడాల్సి వస్తుంది
-ఈనెలాఖరులోగా ఆర్టీసి ఇ.యు రాష్ట్రస్దాయి సమావేశం నిర్వహించి దశలవారి ఆందోళణలను ఉదృతం చేస్తాం
-ఆర్టీసి ఇ.యు రాష్ట్రఅధ్యక్ష,ప్రధానకార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జి.వీ.నరసయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఐదేళ్ల క్రితం ప్రభుత్వంలో విలీనం అయిన ఆర్టీసి ఉద్యోగుల సమస్యలు రోజు రోజుకు అధికం అవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన భకాయిలు వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆర్టీసి రిటైర్ అయిన చనిపోయినవారికి 2022 నుండి లీవ్ ఎన్ క్యాష్ డబ్బులు ఇంత వరకు చెల్లించలేదు,అలాగే గ్రాట్యూటీ డబ్బులు కూడా 2024 డిసెంబర్ నుండి ఇప్పటి వరకు చెల్లించక పోవడంతో రిటైర్ అయిన ఆర్టీసి ఉద్యోగులు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందులు పడుతున్నారు.11వ పిఆర్శి కి చెందిన 24 నెలలు భకాయిలు,డిఏ బకాయిలు,రావల్సిన నాలుగు కొత్త డిఏ లు అన్ని పెండింగులోనే ఉన్నాయి.అంతేకాకుండా గత ఐదేళ్లుగా పదోన్నతలు కూడా ఆర్టీసి ఉద్యోగులకు ఇవ్వకుండా పెండింగు ఉన్నాయి. ఈసమస్యలు పరిష్కారించాలని ఇప్పటికే ఆర్టీసి ఇ.యు గా రాష్ట్రవ్యాప్తంగా గతనెల 4/5 తేదీలలో ధర్నాలు నిర్వహించడం జరిగింది.
అయితే ప్రస్తుతం విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్న ఆర్టీసి స్దలం కూడా లులూ మాల్‌కు గవర్నర్ పేట 1&2 డిపోలకు చెందినది రూః400 కోట్లు విలువైన ఆర్టీసి విలువైన స్థలాలను కేటాయించేలా జీఓ 137 జారిచేయడం ఇప్పటికే ఏపిపిటిడి(ఆర్టీసి)ఎంప్లాయీస్ యూనియన్ గా దశలవారిగా ఉద్యమాన్ని చేస్తున్నాము,ఇప్పటికే 20 జిల్లాలలో ఆర్టీసి ఉద్యోగులను భవిష్యత్ లో ఏఉద్యమానికి పిలుపు నిచ్చినా సిద్దంగా ఉండాలని ముఖ్యనాయకుల సమావేశాలు,ప్రెస్ మీట్సు పూర్తి అయ్యాయి.ఇంకా ఆరుజిల్లాలలో ఈనెల 17 న జిల్లా స్దాయినాయకుల సమావేశాలతో పాటు ప్రెస్ మీట్లు ఉన్నాయని అవి పూర్తియిన వెంటనే ఈనెల 27 తరువాత వినాయకచవితి నాటికి కూడా ఆర్టీసి ఉద్యోగుల సంబందించిన ప్రధాన సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ నెలాఖరులో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి సమావేశం లో వచ్చిన అభిప్రాయలు మేరకు రాష్ట్రస్దాయి లో మిగిలిన సంఘాలతో కలసి సమావేశం అయి తదుపరి చేపట్టాల్సిన కార్యచరణలను ప్రకటిస్తామని ఏపిపిటిడి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు,రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.వీ.నరసయ్య మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలియచేసారు.
Prajavartha Online Telugu News