Breaking News

తెనాలిలో క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవం

-రణరంగ చౌక్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు నివాళి అర్పించిన మంత్రి నాదెండ్ల మనోహర్

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల అన్నారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో రణరంగ చౌక్‌లో క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొన్నారు. రణరంగ చౌక్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1942 ఆగస్టు 12న తెనాలిలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఏడుగురు ఉద్యమకారులు అమరులయ్యారని గుర్తుచేశారు. మాజేటి సుబ్బారావు, సిరిగిరి లింగం, భాస్కరుని లక్ష్మీనారాయణ, తమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకోటయ్య, ప్రయోగ రాఘవయ్య, జాస్తి అప్పయ్య ఉన్నారు. స్వరాజ్యం కోసం రైతాంగం తమ ఆస్తులను త్యాగం చేశారని, మహిళలు తమ మెడలోని నగలను గాంధీజీకి అందజేసి దేశ సేవలో భాగమయ్యారన్నారు. క్విట్ ఇండియా ఘటన జరిగిన 17 సంవత్సరాల తర్వాత, అమరవీరుల జ్ఞాపకార్థం వారి ప్రాణాలు కోల్పోయిన చోటే ఏడు స్తూపాలు, ఒక విగ్రహాన్ని నిర్మించారు. ఆ ప్రదేశానికి రణరంగ చౌక్ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా రణరంగ చౌక్‌లో అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం, తెనాలిలో వివిధ రంగాల్లో ప్రజాసేవలు అందిస్తున్న ప్రముఖులను మంత్రి ఘనంగా సన్మానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *