-గాంధీజీ మనకిచ్చిన పవర్ ఫుల్ వెపన్ అహింస
-మన దేశ పవర్ ఫుల్ మిస్సైల్ నరేంద్ర మోదీ
-స్వాతంత్రోద్యమంలో గుంటూరు జిల్లా చెరగని ముద్ర
-గత 5ఏళ్ల చీకటిపాలనలో రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి
-డబుల్ ఇంజన్ సర్కారుతో విజయవంతంగా తొలిఅడుగు
-ఏడాదిలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు
-స్వాతంత్రోద్యమ వేడుకల్లో రాష్ట్ర మానవ వనరులు. ఐటి, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు మహాత్మా గాంధీ చెప్పిన ఒక్క గొప్ప విషయం నాకు గుర్తుకు వస్తోంది. ప్రపంచంలో ఏ మార్పు రావాలని కోరుకుంటున్నావో ఆ మార్పు నీ నుండే మొదలవ్వాలని గాంధీజీ చెప్పారు, ఆ మహనీయుని స్పూర్తితో మార్పు మన నుండే మొదలుకావాలని రాష్ట్ర మానవ వనరులు. ఐటి, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు.
శుక్రవారం 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సంధర్భంగా స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర మానవ వనరులు. ఐటి, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్ “జాతీయ పతాకావిష్కరణ” చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, ఐజీ సర్వశ్రేష్టి త్రిపాఠి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాదు, నగరపాలక సంస్థ మేయరు కోవెలమూడి రవీంద్ర, శాసన సభ్యులు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, దూళిపాళ్ళ నరేంద్రకుమార్, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవతేజ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా,రాష్ట్ర మాదిగ కార్పోరేషన్ చైర్ పర్సన్ డా. ఉండవల్లి శ్రీదేవి, రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చెర్మన్ మన్నవ మోహన కృష్ణా, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి చైర్మన్ డేగల ప్రభాకర్, రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాల రావు, జీడీసీసీ భ్యాంకు చైర్మన్ మక్కెన మల్లిఖార్జున, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ పోలీస్ పేరేడ్ ను పరిశీలించి, పోలీస్ , ఎన్ సి సి దళాలు, ఇండియన్ రెడ్ క్రాస్ వాలంటీర్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సంధర్బంగా రాష్ట్ర మానవ వనరులు. ఐటి, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్ స్వాతంత్య్ర దినోత్సవం సందేశమిస్తూ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. దేశమంతా కలిసి చేసుకునే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ. జెండా పండుగ నాకు ఒక ఎమోషన్. ఇండిపెండెన్స్ డే అనగానే నాకు నా స్కూల్ డేస్ గుర్తొస్తాయి. ఇండిపెండెన్స్ డే వస్తుంది అంటే ఒక హడావిడి ఉండేది. ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ ను డెకరేట్ చేసే వాళ్ళం. స్కూల్ లో పెట్టే కాంపిటీషన్స్ కోసం స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర గురించి తెలుసుకునే వాళ్ళం. ఫైనల్ గా ఎవరైనా గెస్ట్ వచ్చి జెండా ఎగరేసినప్పుడు గూస్ బమ్స్ వచ్చేవి. ఆ మూమెంట్ ఈ రోజు మళ్ళీ నాకు గుర్తొచ్చింది. ప్రపంచంలో ఒకే ఒక్క పవర్ ఫుల్ వెపన్ ఉంది. ఇతర ఏ వెపన్స్ చెయ్యలేని పని ఆ వెపన్ చేస్తుంది. ఆ వెపన్ పేరే అహింస. ఆ వెపన్ మనకు ఇచ్చిన గొప్ప వ్యక్తి గాంధీ తాత. అహింస, సత్యం, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో స్వాత్రంత్య్రం సాధించారు.
తెలుగునేలది ప్రత్యేక చరిత్ర
స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో తెలుగు నేల కు ప్రత్యేక చరిత్ర ఉంది. బ్రిటిష్ వాడి తుపాకీకి గుండె చూపిన యోధుడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు. జాతీయ జెండాను పింగళి వెంకయ్య రూపొందించారు. “మాకొద్దీ తెల్లదొరతనం” అని నినదించారు గరిమెళ్ల సత్యనారాయణ. అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి ఎంతో మంది దేశభక్తులు, స్వాతంత్య్రం సమరయోధులు మన తెలుగు నేలపైనే పుట్టారు. మన సమరయోధుల ఘనకీర్తి దేశానికి తెలిసేలా చేద్దాం. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేద్దాం. గుంటూరు జిల్లాలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన జిల్లాలోని పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలిలో ఆందోళనలు జరిగాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తెనాలికి చెందిన ఏడుగురు ప్రాణ త్యాగం చేసారు. మంగళగిరిలో స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్న ప్రముఖులు, ఆనాటి ఘట్టాలను గుర్తు చేస్తూ ఒక మ్యూజియంను ఏర్పాటు చేయబోతున్నాం.
స్వాతంత్రోద్యమంలో చెరగని ముద్ర
స్వతంత్ర పోరాటంలో గుంటూరు నేలది చెరగని ముద్ర. మన జిల్లాకు చెందిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కన్నెగంటి హనుమంతు, పర్వతనేని వీరయ్య చౌదరి, తమనంపల్లి అమృతరావు వంటి ఎంతోమంది దేశభక్తులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. వారందరి సేవలను మనం గుర్తు చేసుకోవాలి. కులం, మతం, ప్రాంతం కంటే దేశం గొప్పది. అందరిలోనూ దేశ భక్తి ఉండాలి. దేశం కోసం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఒక్కటి అవ్వాలి. ఈ సందర్భంగా పెహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి మాట్లాడుకోవాలి. పాకిస్థాన్ ఉగ్రవాదులు పెహల్గామ్ లో దాడులు చేసి 26 మంది అమాయకుల్ని చంపేసారు. గత ప్రభుత్వాల మాదిరి మనం కన్నీరు పెట్టుకొని ఇతర దేశాల సహాయం కోసం వెళ్ళలేదు. మన దేశ పవర్ ఫుల్ మిస్సైల్ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు పాకిస్తాన్ కి సరైన శిక్ష వేసారు. ఆపరేషన్ సిందూర్ తో మన పవర్ ఏంటో ప్రపంచానికి తెలియజేసారు. ఆపరేషన్ సిందూర్ జరిగేప్పుడు కొంతమంది సైనికులను కూడా మనం కోల్పోయాం. అందులో మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ ను కూడా కోల్పోయాం. మురళీ నాయక్ తల్లితండ్రిని నేను కలిసాను. వారికి ఒక్కడే కొడుకు. మురళి నాయక్ సైన్యం లోకి వెళ్లడం వారికి ఇష్టం లేదు. మురళి నాయక్ ను ఆర్మీ కి వెళ్లొద్దు, నీకు ఏమైనా అయితే మేము తట్టుకోలేం అన్నారు. అప్పుడు మురళి నాయక్ ఒక్కటే చెప్పాడు. నేను యుద్ధంలో చనిపోతే దేశం మొత్తం మీ కోసం నిలబడుతుంది అని. మురళి నాయక్ లాంటి సైనికులు బోర్డర్ లో పోరాడుతున్నారు కాబట్టే మనం ఇక్కడ స్వేచ్ఛగా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం.
5ఏళ్ల అరాచకపాలనలో 30ఏళ్లు వెనక్కి
2019 నుండి 2024 వరకూ ఆంధ్రప్రదేశ్ లో చీకటి రోజులు చూసాం. గత ప్రభుత్వం ఐదేళ్ల లో 10 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి నెట్టారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అడ్రెస్స్ లేకుండా పోయింది. 2024 లో ప్రజలు చరిత్ర సృష్టించారు. 94 శాతం స్ట్రైక్ రేట్, 164 సీట్ల లో ఎన్డీయే ను గెలిపించి రికార్డులు బద్దలు కొట్టారు. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం చీకటి నుండి వెలుగు వైపు తొలి అడుగు వేసింది. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనన్న కలిసి సుపరిపాలనలో తొలిఅడుగు వేసారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కరించుకున్నాం. అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చింది. పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. విశాఖ ఉక్కును గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి సహకారంతో కాపాడుకోగలిగాం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. రాయలసీమ ఇండస్ట్రియల్ కారిడార్ కి సహకారం అందించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మన నినాదం. అందుకు అనుగుణంగానే రాష్ట్రం నలుమూలల వివిధ రకాల పరిశ్రమలు రప్పిస్తున్నాం. 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం, అందులో భాగంగా ఆర్సెలర్ మిట్టల్, ఎఎన్ఎస్ఆర్, సత్వ వంటి బడా కంపెనీలను రాష్ట్రానికి రప్పించాం.
సూపర్ సిక్స్… సూపర్ హిట్
పేదలను పేదరికం నుండి బయటకు తీసుకురావడమే నిజమైన స్వాతంత్య్రం అని నేను బలంగా నమ్ముతాను. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయి. పెన్షన్ 4 వేలు చేసాం, దివ్యాంగులకు 6 వేలు, పూర్తిగా బెడ్ కే పరిమితం అయితే 15 వేలు. నేను ఛాలెంజ్ చేసి చెబుతున్నా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4 వేల పెన్షన్ ఇవ్వడం లేదు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కరిని బడికి పంపి, ఇంకొకరిని పనికి పంపాలి అనేది గత ప్రభుత్వ విధానం. కానీ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చారు. 67 లక్షల 27 వేల మంది పిల్లలకు 10,091 కోట్లు అందించారు. అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకి 7 వేల సాయం మొదటి విడత కింద అందించాం. దీపం పథకం కింద 2 కోట్ల సిలిండర్లు ఉచితంగా మహిళలకు అందించాం. ఈ రోజు నుండి స్త్రీ శక్తి కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. గత ప్రభుత్వ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చెయ్యలేదు. మీ ప్రజా ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసింది. 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 9.35 లక్షల కోట్ల పెట్టుబడి తద్వారా 8.5 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు చేసుకున్నాం. ఆర్సెల్లార్ మిట్టల్, ఎన్టిపిసి, బిపిసిఎల్, టిసిఎస్, కాగ్నిజెంట్, సత్వా, ఏఎన్ఎస్ఆర్, ఎల్జీ ఎలెక్ట్రానిక్స్, రెన్యూ ఇలా అనేక పెద్ద సంస్థలు ఏపీకి వచ్చాయి.
విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు
విద్యా వ్యవస్థలో ఏడాదిగా సమూల మార్పులు తెచ్చాం. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలి అనేది నేను బలంగా నమ్ముతాను. గత ప్రభుత్వ రంగుల, పేర్ల పిచ్చి మీరు చూసారు. కోడి గుడ్డు దగ్గర నుండి పిల్లలు వేసుకునే యూనిఫామ్ వరకూ పార్టీ రంగులు ఉండేవి. నేను విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత అనేక సంస్కరణలు తీసుకొచ్చాను. కేజీ నుండి పిజి వరకూ కరికులం మార్చాము. సెమిస్టర్ వైస్ బుక్స్ తీసుకొచ్చి పిల్లలకు బరువు తగ్గించాం. పుస్తకాల్లో నా ఫోటోలు లేవు, ముఖ్యమంత్రి గారి ఫోటోలు లేవు. గతంలో 1200 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే ఇప్పుడు 9600 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేసాం. మెగా పిటిఎం నిర్వహిస్తున్నాం. విద్యకు సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర ఏ కార్యక్రమాలు స్కూల్స్ లో నిర్వహించడానికి లేదని ఆర్డర్ ఇచ్చాం. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాం. స్టూడెంట్ కిట్ కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు పెట్టాం. పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తున్నాం. చాగంటి కోటేశ్వరరావు గారు రూపొందించిన నైతిక విలువల పుస్తకాలు విద్యార్థులకు ఇస్తున్నాం. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజన పధకం ఆపేసారు. నేను తిరిగి ప్రారంభించాను. యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తున్నాం. మంచి వ్యక్తులను వీసీలుగా నియమిస్తున్నాం. పాఠ్యపుస్తకాల్లో లింగసమానత్వం ఉండేలా ఇంటి పనుల ఫోటోలు చెరోసగం ఉండేలా చర్యలు తీసుకున్నాం. మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులను అనుసంధానం చేస్తున్నాం.
యంత్రాంగానికి కృతజ్ఞతలు
గత ఏడాది కాలంలో గుంటూరు జిల్లాలో జరిగిన అభివృద్ధిని మీకు నివేదిక రూపంలో అందించాం. గుంటూరు జిల్లా అభివృద్ధికి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి, నా తోటి మంత్రులు, ప్రజాప్రతినిధులకు అధికారులకు, జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న జిల్లా అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరైన స్వాతంత్య్ర సమరయోధులకు, అమరయోధుల కుటుంబాలకు నా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్న కలెక్టర్, సత్వర న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా న్యాయమూర్తి, శాంతిభద్రతలను కాపాడటానికి నిరంతరం కృషి చేస్తున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆయన బృందానికి నా ప్రత్యేక అభినందనలు. జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు, బ్యాంకర్లకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రజలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు
అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ప్రగతిని చాటిచెప్పేలా ప్రభుత్వ శకటాల ప్రదర్శన సాగింది.
జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పధకాల పురోగతిని వివరిస్తూ ప్రభుత్వ శాఖలు శకటాలను ప్రదర్శించారు. జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్షా, వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ, జిల్లా వైద్యారోగ్యశాఖ, ఆంద్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ – వెలుగు, జిల్లా పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృధ్ది శాఖ, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మరియు సంస్థ, గుంటూరు నగరపాలక సంస్థ, జిల్లా రవాణా శాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన , అగ్నిమాపక సేవలు శాఖ శకటాలు ప్రదర్శించడం జరిగింది. శకటాల ప్రదర్శనలో మొదటి స్థానం జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్షా , ద్వితీయ స్థానం జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ – వెలుగు, తృతీయ స్థానం గుంటూరు నగరపాలక సంస్థ సాధించాయి.
స్వాతంత్ర్యదినోత్సవ స్పూర్తిని స్మరింప చేసేలా చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలు
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విధ్యార్దులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు స్వాతంత్ర్య స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను స్మరణకు తీసుకువచ్చి స్వాతంత్ర్య దినోత్సవ స్పూర్తిని నింపాయి. ఎస్ఎస్ఎన్ ప్రభుత్వ పాఠశాల విధ్యార్దులు, పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల విధ్యార్ధులు, నటరాజ అకాడమి, శ్లోకా ఫౌండేషన్ విధ్యార్ధులు, శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ విధ్యార్ధులు దేశభక్తి ప్రభోద గీతాలకు అనుగుణంగా చేసిన నృత్య ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలో ప్రధమ స్థానం శ్రీ వెంకటేశ్వర బాల కుటీర్, ద్వీతీయ స్థానం ఎస్ఎస్ఎన్ ప్రభుత్వ పాఠశాల, తృతీయ స్థానం పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల, నాల్గవ స్థానం నటరాజ అకాడమి, శ్లోకా ఫౌండేషన్ విధ్యార్ధులు సాధించారు.
శకటాల ప్రదర్శనలో, సాంస్కృతిక కార్యక్రామాలలో ప్రదర్శనలో ప్రధమ, ద్వీతియ, తృతీయ స్థానాలు సాధించిన శాఖల అధికారులకు, పాఠశాలల విధ్యార్ధులకు రాష్ట్ర మానవ వనరులు. ఐటి, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్ మెమోంటోలు అందించారు. రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావును, యువికా అవార్డుల సాధించిన విధ్యార్ధులు సందు పవన్ దుర్గా, లావణ్య, వి సోమశేఖర్ లను మంత్రి నారా లోకేష్ ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు మెడల్స్, జిల్లా అధికారులకు, ఉద్యోగులకు ప్రశంస పత్రాలను మంత్రి నారా లోకేష్ ప్రదానం చేశారు. యుధ్ధం లో వీరమరణం పొందిన సైనికుల సతీమణులు చిట్టిమాడుగుల నవీన, దొండపాటి అన్నపూర్ణలను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఘనంగా సన్మానించారు.
రాష్ట్ర మానవ వనరులు. ఐటి, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఆర్టీజి శాఖల మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, ఐజీ సర్వశ్రేష్టి త్రిపాఠి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాదు, నగరపాలక సంస్థ మేయరు కోవెలమూడి రవీంద్ర, శాసన సభ్యులు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, దూళిపాళ్ళ నరేంద్రకుమార్, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవతేజ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా తో కలసి వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. నైపుణ్యాభివృద్ది శాఖ, విద్యాశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ – వెలుగు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ, పట్లణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణ నీటిసరఫరా మరియు పారిశుద్ధ్యశాఖ, ఉధ్యాన శాఖ వ్యవసాయశాఖ, మత్య్సశాఖ, జిల్లా నీటియాజమాన్య సంస్థ, వైద్యారోగ్యశాఖ, విద్యుత్ ఏపీసీపీడీసీఎల్, చేనేత మరియు జౌళి శాఖ, ఆర్ ఈ ఎస్ భీ టీ ఐ, ఎస్సీ కార్పోరేషన్, వయోజన విద్యా, ఏపీ సెకండరీ హెల్త్ శాఖ, ఏపీఎంఐపీ, పశుసంవర్ధక శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్ ట్యాప్ లు , సెల్ ఫోన్ లు, వీల్ చైర్స్ అందించారు. ఎపీఎంఐపీ ద్వారా 35 మంది రైతులకు రూ.12.8 లక్షల విలువైన స్పింకర్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాల మంజూరు పత్రాలను, జిల్లాలో 15,603 స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, మరియు ఉన్నతి ద్వారా రుణాలు రూ.170 కోట్లు చెక్కును లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ అందించారు. జిల్లా సైనిక సంక్షేమ నిధి కి డీఆర్డీఏ స్వయంసహాయక సంఘాలు అందించిన విరాళం రూ. 6,41,475 లను మంత్రి లోకేష్ చేతులు మీదుగా సైనిక సంక్షేమ శాఖ అధికారులకు అందించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు అర్దిక లిటరసీ అవగాహన కోసం డీఆర్డీఏ ఆధ్వర్యంలో రూపొందించిన స్నేక్ అండ్ ల్యాడర్ ఆటలో మంత్రి నారా లోకేష్ కొద్దిసేపు పాల్గొన్నారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, ఆర్డీవో శ్రీనివాసరావు, డిప్యూటీ మేయరు సజీలా, పశ్చిమ మండల తహశీల్దారు వెంకటేశ్వర్లు, తూర్పు మండల తహశీల్దారు సుభాని, స్వాతంత్య్ర సమర యోధులు, మాజీ సైనికులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, విధ్యార్ధులు, ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News