Breaking News

గుంటూరు నగర పాలక సంస్థకు ఉత్తమ సేవా పతకం 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గుంటూరు నగరంలో అధిక ప్రాధాన్యం కలిగి వుంది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ప్రభుత్వ విభాగాల్లో మెరుగైన సేవలు అందించినందుకు గుంటూరు నగర పాలక సంస్థకు ఉత్తమ సేవా పతకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రివర్యులు నారా లోకేష్ నగర మేయర్ మరియు కమిషనర్లకు అందచేశారు. శుక్రవారం నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నగర పాలక సంస్థ తరుపున నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మరియు కమిషనర్ పులి శ్రీనివాసులకు షీల్డ్ మరియు ప్రశంసా పత్రాన్నిఅందజేశారు. అంతేకాక సదరు వేడుకల్లో తడి పొడి వ్యర్ధాల విభజన అంశం పై నగర పాలక సంస్థ రూపొందించిన శకటానికి 3వ స్థానం దక్కింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నగర పాలక సంస్థ రూపొందించిన శకటానికి 3వ స్థానం దక్కటం ఎంతో సంతోషంగా ఉందని, ఈ అవార్డు స్పూర్తితో గుంటూరు నగర ప్రజలకు త్రాగు నీటి సరఫరా, పారిశుధ్యం మరియు ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో మెరుగైన సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యస్. నాగలక్ష్మి, జిల్లా యస్.పి సతీష్ కుమార్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *