Breaking News

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

విజ‌యవాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సంధర్బంగా సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ PNT కాలనీ లోని డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్ దగ్గర సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు చేతులు మీదుగా జెండా వందన కార్యక్రమం చేసి ఈరోజు శ్రావణ శుక్రవారం కావడంతో ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అనే భావనతో సోదరీమణులందరికి బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా పసుపు, కుంకుమ, తాంబూలం ఇచ్చి గౌరవించారు. అనంతరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, పలువురు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *