Breaking News

రాష్ట్ర మాజీ సైనిక సంఘం కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

విజ‌యవాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మాజీ సైనిక సంఘం, వ్యవస్థాపక అధ్యక్షులు మోటూరి శంకరరావు శుక్రవారం తమ కార్యాలయంలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర మాజీ సైనిక సంఘం, వ్యవస్థాపక అధ్యక్షులు మోటూరి శంకరరావు మాట్లాడుతూ బ్రిటీష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తి కలిగించేందుకు ఎంతో మంది మహనీయులు ప్రాణ త్యాగం చేశారు. వారి త్యాగపూరితమైన పోరాట ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దేశంలో ప్ర‌జ‌లంద‌రూ కుల‌మ‌తాల‌కు అతీతంగా జ‌రుపుకునే ఏకైక పండుగ స్వాతంత్య్ర దినోత్స‌వం అని అన్నారు. అనంతరం పిల్లలు, విద్యార్థిని, విద్యార్థులకు స్వీట్స్, బిస్కెట్స్, చాక్లెట్, పుస్తకాలు, పెన్నులు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక సంఘం నాయకులు,  సభ్యులు, ప్రతినిధులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *