Breaking News

నగర మేయర్ అధ్యక్షతన సాధారణ సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరానికి స్వాతంత్ర్య సమరయోధులు మరియు మొట్టమొదటి గుంటూరు మునిసిపల్ చైర్మన్ నడింపల్లి వెంకట లక్ష్మి నరసింహారావు పేరు పెట్టుటకు కౌన్సిల్ ఆమోదం తెలుపుట జరిగిందని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సాధారణ సమావేశం నగర మేయర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సమావేశంలో ఎజెండాలోని 61 ప్రశ్నలు, 71 ప్రియాంబుల్స్ మొత్తంగా 131 అంశాల పై సమగ్ర చర్చ జరిపి ఎజెండాని ఆమోదించడం జరిగిందన్నారు. సమావేశం నందు వీధి కుక్కల నియంత్రణ, స్ట్రీట్ వెండింగ్ జోన్స్, అభివృద్ధి పనులు నిర్దేశిత సమయంలోపు చేయని కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవడం, విలీన గ్రామాలలో త్రాగు నీటి సరఫరా, ఆర్.డి.పి ల పై చర్చించారు. ముఖ్యంగా నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశామందిరానికి స్వాతంత్ర్య సమరయోధులు మరియు మొట్టమొదటి గుంటూరు మునిసిపల్ చైర్మన్ నడింపల్లి వెంకట లక్ష్మి నరసింహారావు పేరు పెట్టుటకు కౌన్సిల్ ఆమోదం తెలుపుట జరిగిందన్నారు. సమావేశ మినిట్స్ ని ప్రత్యేకంగా నమోదు చేయాలని, సమావేశ అనంతరం మినిట్స్ ని సభ్యులకు అందించాలన్నారు. ప్రతి సభ్యునికి సమగ్ర సమాధానం, సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారుల పై ఉందన్నారు. నగరంలో జరిగే ప్రతి అధికారిక అభివృద్ధి పని శంకుస్తాపనలు, ప్రారంభోత్సవాలకు స్థానిక కార్పొరేటర్ తో పాటు, శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులకు ఆహ్వానం తెలియచేయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు నగర సంగ్రాభివ్రుద్దికి స్థానిక శాసన సభ్యులు, కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. నగరంలోని డివిజన్లలో స్థానిక సమస్యల పరిష్కారానికి డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, స్థానిక సమస్యలను కార్పొరేటర్లు గ్రూప్ లో పోస్ట్ చేయ వచ్చని, అధికారులు సంబంధిత సమస్యల పరిష్కార చర్యలను కూడా గ్రూప్ లోనే తెలియ చేయవచ్చునన్నారు.
సమావేశం నందు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు నాజీ అహ్మద్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గల్లా మాధవి, ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యులు బూర్ల రామాంజనేయులు, యం.యల్.సి చంద్రగిరి ఏసురత్నం, అదనపు కమిషనర్ వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *