Breaking News

అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించం

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-పెన్షన్లపై వైసీపీది అనవసర రాద్ధాంతం
-పార్టీని బతికించుకోడానికి వైసీపీ నాయకులు అబద్ధాలు ప్రచారం
-పంచాయతీ కేంద్రాల్లో ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు
-పెనుకొండలో టీడీపీ కార్యాలయ నిర్మాణం : మంత్రి సవిత
-పి.రొప్పాలలో రూ.2 కోట్లతో పీహెచ్సీ భవన నిర్మాణం
-భూమి పూజ చేసిన మంత్రి…
-ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు కూడా భూమి పూజ

పెనుకొొండ/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించే ప్రసక్తే లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. పెనుకొండ నియోజక వర్గంలోని రొద్దం మండలం పెదమంతురు పంచాయతీ పి.రొప్పాల గ్రామంలో రూ.2 కోట్లతో పీహెచ్సీ భవన నిర్మాణానికి మంత్రి సవిత భూమి పూజ చేశారు. అనంతరం అదే గ్రామంలో అన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు కూడా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందేలా పాలన సాగిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మంటపాలకు ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నామన్నారు. ప్రజాభీష్టం మేరకు సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు.

అర్హుల పెన్షన్లు తొలగించడం లేదు…

అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించడంలేదని మంత్రి సవిత తెలిపారు. వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, పార్టీని బతికించుకోడానికి ఆ పార్టీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కూడా అందజేయనున్నామని, ఇప్పటికే రేషన్ కార్డులు అందజేశామని మంత్రి సవిత తెలిపారు.

ప్రతి పంచాయతీలోనూ ఎన్టీఆర్ విగ్రహం

నియోజక వర్గంలో ఉన్న ప్రతి పంచాయతీ కేంద్రంలోనూ అన్న ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. దీనిలో భాగంగానే అన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు కూడా భూమి పూజ చేశామన్నారు. సోమందేపల్లిలో ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. పెనుకొండలో ప్రస్తుతం తన సొంత నిధులతో అన్న క్యాంటీన్ ను నిర్వహిస్తున్నానని, త్వరలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. నియోజక వర్గ కేంద్రం పెనుకొండలో టీడీపీ కార్యాలయం నిర్మించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.

త్వరలో కందుకూరు పల్లి నుంచి చెనుకొండపల్లి రహదారికి భూమి పూజ

రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని, నియోజక వర్గంలోనూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సవిత తెలిపారు. రొద్దం మండలంలో రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, కాలువలు నిర్మించామన్నారు. రూ.2 కోట్లతో పీహెచ్సీ భవనాన్ని నిర్మించబోతున్నామన్నారు. తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేపడుతున్నామని, రెండు తాగునీటి బోర్లు కూడా మంజూరు చేశామని వెల్లడించారు. మండల కేంద్రంలో బీసీ కమ్యూనిటీ హాల్, అదనంగా మరో బీసీ హాస్టల్ ను కూడా నిర్మింబచోతున్నట్లు తెలిపారు. త్వరలో కందుకూరు పల్లి నుంచి చెనుకొండపల్లి రహదారి నిర్మించబోతున్నామన్నారు. ఇందుకు సంబంధించి భూమి పూజ కూడా త్వరలో చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. అంతకుముందు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి సవితకు పి.రొప్పాల గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *