Breaking News

క్యాంటీన్ పరిసరాల పరిశుభ్రంకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటిస్తూ, ఆహారం నిర్దేశిత సమయపాలన పాటిస్తూ అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆర్టీఓ కార్యాలయం దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లకు ప్రతి రోజు ప్రభుత్వ నిర్దేశిత సమయంలో ఆహారం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. క్యాంటీన్ పరిసరాల పరిశుభ్రంకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నోడల్ అధికారులు తమకు కేటాయించిన క్యాంటీన్లల్లో మౌలిక వసతులు, ఆహార సరఫరాలను ప్రతి రోజు పరిశీలించాలన్నారు. ప్రధానంగా త్రాగునీరు, పారిశుధ్యం మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే క్యాంటీన్లకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఆహారం అందేలా ఇండెంట్ ఉండాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *