గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన రోడ్ల వెంబడి స్వీపింగ్ క్రమ పద్దతిలో రోడ్, డివైడర్ వెంబడి సమగ్రంగా శుభ్రం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజారోగ్య అధికారులు, శానిటేషన్ కార్యదర్శులను ఆదేశించారు. శనివారం జీటి రోడ్, నల్లపాడు, జేకేసి కాలేజీ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య కార్మికులు రోడ్ల ప్రధాన రోడ్లను శుభ్రం చేసేప్పుడు తప్పనిసరిగా సెంట్రల్ డివైడర్ వెంబడి కూడా శుభ్రం చేయాలన్నారు. అలాగే రోడ్ల పక్కన డెబ్రిస్ ఉండకుండా పారిశుద్య పనులు మెరుగ్గా జరిగేలా ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కార్మికులు మస్టర్ అనంతరం ప్రధాన రోడ్లు శుభ్రం, ఇంటింటి చెత్త సేకరణ, మధ్యాహ్నం డ్రైన్ల శుభ్రం చేయాలన్నారు. పలు ప్రాంతాల్లో వేసవిలో చలివేంద్రాల కోసం ఏర్పాటు చేసిన పందిరిలు ఇప్పటికీ ఉండడం గమనించి, తక్షణం వాటిని తొలగించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యదర్శులు మస్టర్ సమయానికి తప్పనిసరిగా విధులకు హాజరు కావాలన్నారు. అనంతరం నల్లపాడు, జేకేసి రోడ్ లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను పరిశీలించి, నిర్దేశిత నిబందనలు పాటించి నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్లానింగ్ కార్యదర్శులు సచివాలయం పరిధిలో నిర్మాణాలు జరుగుతున్న తొలి దశలోనే నిబందనల మేరకు జరుగుతున్నాయా, లేదా అని పర్యవేక్షణ చేయాలన్నారు. అనధికార కట్టడాలపై కార్యదర్షులే భాధ్యత వహించాలని స్పష్టం చేశారు. పర్యటనలో పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News