Breaking News

ఉద్యోగ జీవితమంత క్రమశిక్షణ, నిబద్దతతో సాటి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థలో సుదీర్ఘ కాలం పాటు సేవలందించి నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగులు భవిష్యత్ లో ఆయురారోగ్యాలతో జీవించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు ఆకాక్షించారు. శనివారం కౌన్సిల్ సమావేశ మందిరం నందు ఎలక్షన్ సెల్ సుపరిటేన్దేంట్ గా విధులు నిర్వహిస్తూ నేడు రిటైర్ అవుతున్న పుప్పాల పద్మనాభరావు, డి.పి.ఓ గా విధులు నిర్వహిస్తు రిటైర్ అవుతున్న యం.వి.బి స్వామి, రికార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తు రిటైర్ అవుతున్న చేబ్రోలు భాస్కర రావు లకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సభకు మేయర్ కమిషనర్లు హాజరయ్యారు,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నగర పాలక సంస్థలో వివిధ హోదాలలో పనిచేస్తున్న పుప్పాల పద్మనాభారావు, యం.వి.బి స్వామి, చేబ్రోలు భాస్కర్ రావు లు తమ ఉద్యోగ జీవితమంత క్రమశిక్షణ, నిబద్దతతో సాటి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారన్నారు. భవిషత్ లో కూడా వారు నగర పాలక సంస్థ కు అవసరమైన సమయంలో సూచనలు సలహాలు అందించాలని కోరారు. అనంతరం వారిని మెమొంటోతో సన్మానించి, శాలువాతో సత్కరించారు.
సదరు కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు బి. శ్రీనివాసరావు, టి. వెంకటకృష్ణయ్య, ఇంచార్జ్ యస్.ఈ సుందర్రామి రెడ్డి, మేనేజర్ బాలాజీ బాషా, వివిధ విభాగాల అధకారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *