Breaking News

ఆంధ్రప్రదేశ్ నూతన బార్ పాలసీ 2025-28 : లాటరీ ద్వారా బార్ల కేటాయింపు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు సం.ల కాలానికి (01.09.2025 నుండి 31.08.2028 వరకు) ప్రకటించిన కొత్త బార్ పాలసీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో సాధారణ కేటగిరీ విభాగంలో 130 బార్లు మరియు గీతాకులాల వారికి ప్రత్యేకంగా 10 బార్లు కేటాయించడం జరిగింది. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో గల పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ముందే ప్రకటించిన విధంగా ఈరోజు (30.08.2025) ఉదయం 8.00 గం. నుంచే బార్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్, విజయవాడ టి. శ్రీనివాసరావు, జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ఎస్.శ్రీనివాసరావు మరియు అందరు దరఖాస్తుదారుల సమక్షంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మిశ చే లాటరీ విధానంలో పారదర్శకంగా బార్లు కేటాయించడం జరిగింది.
ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 130 బార్లకు గాను 75 బార్లకు మాత్రమే మొత్తం 262 దరఖాస్తులు వచ్చాయి. 55 బార్లకు ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. వీటిలో నిబంధనల ప్రకారం కనీసం 4 దరఖాస్తులు వచ్చిన 62 బార్ల కేటాయింపు లాటరీ ద్వారా జరిగింది. ఓపెన్ కేటగిరీలో ఒక బార్ కి రెండు దరఖాస్తులు, మరో 12 బార్లకు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఇలా నాలుగు కంటె తక్కువ దరఖాస్తులు వచ్చిన బార్లకు మరలా లాటరీ ద్వారా కేటాయించడానికి ఇదే నోటిఫికేషన్ గడువు పెంచడం జరుగుతుంది. ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాని 55 బార్లకు ఎక్సైజ్ కమీషనర్ గారి ఆదేశాల ప్రకారం మరోమారు ఫ్రెష్ నోటిఫికేషన్ జారీ చేస్తారు.
గీత కులాల వారి కేటగిరీలో మొత్తం నోటిఫై చేసిన 10 బార్లకు గాను అన్ని బార్లకు కలిపి 104 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా గెజిట్ నెంబర్లు 6,7 లకు 13 చొప్పున; అత్యల్పంగా గెజిట్ నెం. 10 బార్ (కొండపల్లి)కి 6 అప్లికేషన్స్ వచ్చాయి. గీత కులాల వారికి కూడా గెజిట్ సీరియల్ నెంబరు ప్రకారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మిశ పారదర్శకంగా లాటరీ తీసి విజేతలకు బార్లను కేటాయించారు. మరియు ఈ పది బార్లకు లాటరీ ద్వారానే మరో ఇద్దరు వ్యక్తులను రిజర్వుడ్ 1 మరియు రిజర్వుడ్ 2 గా నిర్ణయించారు.
విజేతలైన దరఖాస్తుదారులు అందరూ నిర్ణయించిన సాంవత్సరిక లైసెన్సు ఫీజులో 6వ వంతు సొమ్ము ఈరోజు ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించాలి. 01.09.2025 నుండి నూతన బార్ విధానం అమలులోకి వస్తుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *