మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం నగరంలోని డిమార్ట్ నుండి వ్యవసాయ మార్కెట్ కమిటీకి మార్కెట్ ఫీజు చెల్లించాలని మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే వెంకట గురునాథ్ దుర్గా ప్రసాద్ (నాని బాబు) డి మార్ట్ యాజమాన్యాన్ని కోరారు. బుధవారం ఆయన నగరంలోని డి మార్ట్ ను పరిశీలించి డిమార్ట్ యాజమాన్యంతో మాట్లాడారు. మార్కెట్ కమిటీ గన్నవరం నకు మార్కెట్ ఫీజు ఏ విధంగా చెల్లిస్తున్నారో అదేవిధంగా మచిలీపట్నం మార్కెట్ కమిటీ వారికి కూడా మార్కెట్ ఫీజు చెల్లించవలసిందిగా చైర్మన్ యాజమాన్యాన్ని కోరారు. దీంతో స్థానిక డి మార్ట్ యాజమాన్యం వారు సానుకూలంగా స్పందించి వారి పై స్థాయి యాజమాన్యంకు తెలియజేస్తామని చెప్పారు. ఈ పర్యటనలో చైర్మన్ వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి వి భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News