Breaking News

రాష్ట్రంలో 47 కార్పోరేషన్లకు సంబంధించి 481 మంది డైరెక్టర్లను నియమించాం…

-రాష్ట్రంలో బిసి, యస్ సి, యస్టీ, మైనారిటీ వర్గాలకే రాజ్యా ధికారంలో సింహభాగం…
-సామాజిక న్యాయం పాటిస్తూ కార్పోరేషన్ డైరెక్టర్ల ఎంపిక…
-బిపి, యస్ సి, య , మైనారిటీలకు వివిధ పదవుల క్రింద రూ. 1 లక్షా 40 వేల కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాలో
జమచేశాం…
-ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
-రాష్ట్ర హోమ్ శాఖామంత్రి మేకతోటి సుచరిత
-రాష్ట్ర బిసి సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బడుగు బలహీనవర్గాల వారికి రాజ్యాధికారంలో సింహభాగం ప్రాతినిథ్యాన్ని ప్రభుత్వం కల్పించిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
విజయవాడ ఆర్ అండ్ బి కార్యాలయ మీడియా పాయింట్లో శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర హోంశాఖామంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖామంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్, శాసనసభ్యులు మెరుగ నాగార్జునలతో కలిసి 47 కార్పోరేషన్లకు సంబంధించి ఎంపిక చేసిన డైరెక్టర్ల జాబితాను సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 47 కార్పోరేషన్లకు సంబంధించి 481 మంది డైరెక్టర్లను నియమించామని, వారిలో సగానికి పైగా పదవులను మహిళలకు ఇచ్చామని ఆయన అన్నారు. సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థులను ఎంపిక చేశామని ఇందుకోసం భారీ కసరత్తు చేసి సామాజిక న్యాయం పాటించామని ఆయన అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలహీనవర్గాలకు మరింత ప్రాధాన్యతీస్తూ క్యాబినెట్లో 60 శాతం బిసి, యస్ సి, యసీ, మైనారిటీలకు ఇచ్చామని, అసెంబ్లీ స్పీకర్ కూడా బిసియేనని, రాబోయే శాసనమండలి అధ్యక్షుడిని కూడా ఆవర్గానికి చెందినవారినే ఎంపిక చేయనున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
2019 లో అధికారంలోకి వచ్చాక వైయస్ జగన్మోహన రెడ్డి ప్రభుత్వం 15 మంది యంయల్ సిలకు గాను 11 మంది బిసి, యసి, యటీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారినే ఎంపిక చేయడం జరిగిందని, నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్ విధానంలో ఇచ్చే అభివృద్ధి పనుల్లోనూ 50 శాతం బలహీనవర్గాలకే ఇచ్చేవిధంగా ప్రభుత్వం చట్టం చేసిందని ఆయన అన్నారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల్లో 83 శాతం ఈ వర్గాలకు చెందినవారే ఉన్నారని అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ వారి విశ్వాసం పొందేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో నిబద్ధతతో పనిచేస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ అని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బిసి వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పోరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి చెందుతుందని, మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాల్టీలు, నగరపంచాయతీల ఛైర్మన్ పదవుల్లో సగానికి పైగా పదవులు బిసి, యసి, యటి, మైనారిటీలకు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. 137 నామినేటెడ్ పదవుల్లో 79 పదవులను అంటే 58 శాతం ఈ వర్గాలవారికి ప్రభుత్వం ప్రాతినిధ్యం కల్పించిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వం 31 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తే వారిలో 80 శాతం యస్ సి, యటి, బిసి, మైనారిటీ వర్గాలవారే ఉన్నారని రామకృష్ణారెడ్డి అన్నారు.
నిజాయితీతో, నిబద్ధతతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి పనిచేస్తున్నారని, అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏమి చేస్తామని చెప్పామో వాటినన్నింటినీ ముఖ్యమంత్రి ప్రతీ ఒక్కటీ అమలు చేసి చూపుతున్నారని రామకృష్ణారెడ్డి అన్నారు. రాజ్యాధికారంలో సింహభాగం ఈవర్గాలవారికి అందేలా, ఈ ప్రభుత్వం పక్షాన నిర్ణయాధికారంలో ఈ వర్గాలు ఉండేలా ముఖ్యమంత్రి పలు చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారని రామకృష్ణారెడ్డి అన్నారు.
రాష్ట్ర హోమ్ శాఖామంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ మహిళలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి చేతల్లో చేసి చూపుతున్నారని ఆమె అన్నారు. ఈరోజు ప్రకటించిన కార్పోరేషన్ డైరెక్టర్ పదవుల్లో 52 శాతం పదవులు మహిళలకు ఇచ్చి ముఖ్యమంత్రి మహిళాపక్షపాతిగా నిలిచారని ఆమె అన్నారు. సమాజంలో యస్ సి, యటి, బిసి, మైనార్టీలు గతంలో ఎప్పుడూ అణగదొక్కబడ్డారని కానీ సియం వైయస్ జగన్మోహన రెడ్డి మాత్రం అవర్గాలకు ప్రాధాన్యతిస్తూ రాజ్యాధికారంలో సింహభాగం కల్పిస్తున్నారని సుచరిత అన్నారు. మహిళలకు గౌరవం, గుర్తింపు ఇవ్వడం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి గొప్పతనం అని దాదాపు 30 లక్షల ఇళ్లస్థలాల పట్టాలు మహిళల పేరునే ఇచ్చి వారికి అండగా, తోడుగా నిలిచారని, తోబొట్టువులకు స్థిరాస్తి కల్పించారని ఆమె అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల్లోనూ మహిళలకు ప్రాధాన్యతిస్తున్నారని, అమ్మఒడి, చేయూత, ఆసరా మొదలగు పధకాలు ద్వారా మహిళలను ఆర్థికంగా బలో పేతం చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన డైరెక్టర్ల పదవిలో 58 శాతం యస్ సి, యటి, బిసి, మైనార్టీలకు ఇచ్చారని వారిలో 52 శాతం పదవులు మహిళలకే ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర హోం శాఖామంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అంబేద్కర్ కోరుకున్న సమసమాజ స్థాపన అట్టడుగు వర్గాలవారికి గుర్తింపు ఇవ్వడంతోటే ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన రెడ్డి ప్రభుత్వ హయాంలోనే జరుగుతున్నదని, ఈ వర్గాల ప్రజలందరూ ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారని సుచరిత అన్నారు.
బిసి సంక్షేమ శాఖా మంత్రి  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏర్పరుచుకున్న వ్యవస్థలే ప్రభుత్వాలని, ఆ ప్రభుత్వంలో ఉన్న పాలకులు నిండుమనస్సుతో అందరినీ సమదృష్టితో చూడగలిగిననాడు ప్రజలందరూ సంతోషంగా ఉంటారని అటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నవని ఆయన అన్నారు. సామాజిక న్యాయం అన్నది కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపి దేశానికి ఒక మార్గదర్శకుడిగా ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి నిలిచారన్నారు. రాష్ట్రంలో ఇంతకాలం రాజకీయ ప్రాతినిధ్యం లభించని బడుగు బలహీన వర్గాలైన బిసి, యసి, యటి, మైనార్టీ వర్గాలకు ఈరోజు ప్రభుత్వం ఒకభరోసా కల్పించిందని దానితోపాటు ఆవర్గాలకు ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందని దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలేనన్నారు. ఏవర్గా లైతే రాజకీయాలు అందనిద్రాక్ష అనుకున్నారో ఆవర్గాల వారికి ప్రాతినిథ్యం కల్పిస్తూ 47 కార్పోరేషన్ల ద్వారా 481 మంది డైరెక్టర్లను నియమించి బిసి, యసి, యటి, మైనార్టీ వర్గాల ఆత్మగౌరవ రక్షకుడిగా జగన్మోహన రెడ్డి నిలిచారని శ్రీ వేణుగోపాల కృష్ణ అన్నారు.
శాసన సభ్యులు మేరుగ నాగార్జున మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అనేక సంస్కరణలు తీసుకువస్తే భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో బిసి, యసి, య, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన అన్నారు. ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా అర్హులైన ప్రతీ ఒక్క కుటుంబం ఖాతాలోకి నేరుగా డబ్బు జమచేయడం దేశంలో ఎక్కడా చూసి ఉండరని, సామాజిక కోణంలో ఈ వర్గాల వారి అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎనలేని కృషి చేస్తున్నారని నాగార్జున అన్నారు.
పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ మాట్లాడుతూ డైరెక్టర్ల నియామకం ద్వారా పద వికాదు బాధ్యత అని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. గొప్ప మనసున్న ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డికి అందరూ అండగా ఉండాలని, రానున్న రోజుల్లో అందరికీ అవకాశాలు వస్తాయని ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు మెరుగ నాగార్జున, నంబూరి శంకరరావు, నాయకులు చల్లా మధుసూధనరెడ్డి, పి.రత్నాకరరావు, నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *