Breaking News

ప్రశాంతంగా ముగిసిన యుపిఎస్ సి పరీక్షలు…

-పరీక్షలకు హాజరైన 638 మంది అభ్యర్థులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యుపిఎస్ సి ఆధ్వర్యంలో ఆదివారం ఎంప్లాయిస్ ప్రావీడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్స్, అకౌంట్ ఆఫీసర్లు ఉద్యోగ నియకమాలకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని విజయవాడ సబ్ కలెక్టర్ జి. ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ తెలిపారు. ఆదివారం కృష్ణావేణి స్కూల్, మెరిస్ స్టెల్లా కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించారు. తొలుత పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ను స్ట్రాంగ్ రూమ్ నుంచి పరీక్ష కేంద్రాలకు పంపే ఏర్పాట్లను డియర్ ఓ యం. వెంకటేశ్వర్లు,ఏవో వి.శ్రీనివాస్ తో కలిసి పర్యవేక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1608 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాల్సిఉండగా నగరంలో ఏర్పాటు చేసిన 4 పరీక్ష కేంద్రాల్లో 638 (39.67 శాతం)మంది హాజరయ్యారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *