అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సేవా సర్వీసులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పత్రికా ప్రకటన విజయవాడ సబ్ కలెక్టరు వారిచే టెలీ కాన్ఫరెన్స్ నందు ‘అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సేవా సర్వీసులు, ప్రభుత్వ పధకములు విధిగా అందచేయవలసి యున్నదని, చివరకు యే వసతి లేకుండా రోడ్ మార్జిన్ , బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాలు, వివిధ కూడళ్ళు , ఆరు బయలు ప్రదేశాలలో యాచాకులకు, అనాధ వ్యక్తులకు, వలస కూలీలను గూడా సర్వే చేసి, అట్టి వారికి గూడ ప్రభుత్వ పధకములు వర్తించుటాకు గాను అవసరమైన ఆధార్ కార్డులు బియ్యపు కార్డులు, ఆరోగ్య శ్రీ తదితర కార్డులు మంజూరు చేయుటకు తగు చర్యలు తీసుకొనవలసినదిగా సూచించిన దరిమిలా, సదరు సబ్ కలెక్టర్  సూచనల స్ఫూర్తిగా , విజయ వాడ తూర్పు మండల పరిధిలోని గ్రేడ్ -2 గ్రామ రెవెన్యూ అధికారులు ‘ కగ్గా కిరణ్ కుమార్ మరియు వావిలాపల్లి మాధురిలు తమ ప్రాంత పరిధిలో అన్నీ ప్రాంతములను వారి వారి వాలంటీర్ల సహాయముతో సర్వే నిర్వహించినారు.
గ్రేడ్ -2 గ్రామ రెవెన్యూ అధికారులు ‘ కగ్గా కిరణ్ కుమార్ – తమ వాలంటీర్ శ్రీ హరీష్ సియాట్రీ సహకారముతో తమ పరిధిలోని 4 వ వార్డు నందు సర్వే చేసి 12 మంది వృద్ధ యాచ కులను, వలస వ్యక్తులు, మానసిక వికలాంగులను గుర్తించి ప్రభుత్వ సేవా సర్వీసులు, ప్రభుత్వ పధకములు పొందుటకు తీసుకొనుటకు చర్యలు తీసుకొనతమే కాకుండా ప్రతి రోజు వారి వద్దకు వెళ్ళి వారి ఆరోగ్య ఆహార సదుపాయములను యేర్పాటు చేసియున్నారు. వారు చేసిన కార్యక్రముముల వివరములను కొన్నిటిని జతపరచటమైనది.
అలాగే గ్రేడ్ -2 గ్రామ రెవెన్యూ అధికారులు వావిలాపల్లి మాధురిలు – వారు కూడా వారి వారి పరిధిలో విస్తారముగా సర్వే చేసి కులను, వలస వ్యక్తులు, మానసిక వికలాంగులను గుర్తించి ప్రభుత్వ సేవా సర్వీసులు, ప్రభుత్వ పధకములు పొందుటకు తీసుకొనుటకు చర్యలు తీసుకొనతమే కాకుండా ప్రతి రోజు వారి వద్దకు వెళ్ళి వారి ఆరోగ్య ఆహార సదుపాయములను యేర్పాటు చేసియున్నారు. (వారు చేసిన కార్యక్రముము ల వివరములను కొన్నిటిని జతపరచటమైనది.
సదరు గ్రేడ్ -2 గ్రామ రెవెన్యూ అధికారులు ఇరువురు ప్రబుత్వ విధులకు పరిమితి లేని విధంగా, ప్రజా సేవయే పరమో ధ్యేయంగా భావించి, నిర్భాగ్యులుగా ఉన్న వారిని గుర్తించి, వారికి దగ్గరుండి ఆధార్ కార్డును మరియు రైస్ కార్డులను ఇప్పించి, తద్వారా వారికి ఆరోగ్య శ్రీ కార్డులను కూడా అందిస్తూ, అసలైన ప్రజా సేవకులుగా నిలిచినారు. వారి పోషణ కు , వారి ఆరోగ్యానికి, సరియైన భద్రత కల్పించినారు. అర్హత కలిగిన వారందరికి ప్రభుత్వం అందించే పధకాలు అందాలని ఆశించే ప్రభుత్వ లక్ష్యం దిశగా, నూతన ఒరవడి తో అడుగులు వేసిన వారి సేవలను శ్రీయుత సబ్ కలెక్టరు వారు స్వయంగా ఆహ్వానించి, కార్యలయం నందు అభినంధించి యున్నారు. గ్రామ స్థాయిలో ఉన్న అందరూ ప్రభుత్వా సేవకులు వీరిని ఆదర్శంగా తీసుకుని వారి విధులను నిర్వర్తింమ్చాలని, అలా అందరూ చేస్తే మన విజయవాడ డివిజన్ అభివృద్ధి పథంలో నడుస్తూ, ప్రజలంతా సంతోషంగా ఉంటారని, ఈ సందర్భంగా సబ్ కలెక్టర్, సూర్య సాయి ప్రవీణ్ చంద్ గారు పేర్కొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *