Breaking News

తిరుపతి “ప్రెస్ క్లబ్” ఆధునీకరణ ప్రారంభోత్సవం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి “ప్రెస్ క్లబ్” ఆధునీకరణ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, అతిథి ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ కలిసి ఆధునిక భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ… “జర్నలిస్టులు సమాజానికి అద్దం పట్టే వర్గం. వారి కోసం సకల సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ ఆధునిక ప్రెస్ క్లబ్ భవనం తిరుపతి నగరానికి గర్వకారణం అవుతుంది. మీడియా సమాజ సమస్యలను వెలుగులోకి తెచ్చి పరిష్కార మార్గాలను చూపించే శక్తి కలిగిన వృత్తి. జర్నలిస్టులకు ఈ భవనం మరింత స్ఫూర్తిని అందిస్తుంది” అని అన్నారు.

గౌరవ అతిథులుగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, శాప్ చైర్మన్  రవి నాయుడు పాల్గొన్నారు.

ప్రెస్ క్లబ్ తరఫున అధ్యక్షులు మురళి, ఉపాధ్యక్షులు ప్రకాష్ బాబు, లావణ్య కుమార్, కార్యదర్శి బాబు చందు, కోశాధికారి చంద్రబాబు, సంయుక్త కార్యదర్శులు జగదీష్ కుమార్, యమునాథ్, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, మౌలాలి, సుధీర్ కుమార్, రాజశేఖర్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. కో-ఆప్షన్ సభ్యులు ఎన్. సుబ్రమణ్యం, ఎన్. గోపీనాథ్, ఎస్. గోపాలకృష్ణయ్య తో పాటు టీటీడీ అధికారులు చీఫ్ ఇంజనీర్ సదానందం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషాద్రి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్.వి.ఎన్. గోపాలగౌడ్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కూటమి నాయకులు తదితరులు  పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *