Breaking News

సూప‌ర్ 6 సూప‌ర్ హిట్ తో జ‌గ‌న్ రెడ్డికి భ‌యం పట్టుకుంది

-ప్రజలు బుద్ధి చెప్పినా సైకోయిజం మార్చుకోని జగన్
-యూరియాను బ్లాక్ లో అమ్మేసిన ఘ‌న‌త వైసీపీది
-రాజకీయ లబ్ధి కోసమే యూరియాపై అసత్య ప్రచారాలు
-ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
సూప‌ర్ 6 – సూప‌ర్ హిట్ స‌భ‌కు అనంత‌పురానికి వ‌చ్చిన ల‌క్ష‌లాది ప్ర‌జానీకాన్నిచూసి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి భ‌యం ప‌ట్టుకుంద‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ఎద్దేవా చేశారు. అనంత‌పురం స‌భ విజ‌య‌వంతం అవ‌డంతో అస‌హ‌నానికి గురైన జ‌గ‌న్ రెడ్డి త్వ‌ర‌లోనే వైసీపీని మూసేయ‌డం ఖాయ‌మ‌ని విమ‌ర్శించారు. ఈ మేరకు గురువారం నాడు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. యూరియా కొరతపై వైసీపీ నాయకులు హడావిడి చేయడం హాస్యాస్పదమని మంత్రి గొట్టిపాటి స్ప‌ష్టం చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి పనీ చేయలేదని, ఎవరైనా చేస్తే ఓర్చుకోలేర‌ని తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ దోపిడీ చేయడమే జగన్ లక్ష్యమని, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించడమే చంద్రబాబు ధ్యేయమని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని జగన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. యూరియా కొరత లేకపోయినా వైసీపీ నాయకులు అనవసర రాద్దాంతాలతో రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. టన్నుల కొద్ది యూరియాను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మేసిన చరిత్ర వైకాపా వాళ్లదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను అడ్డుకునేందుకే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు, డ్రామాలకు తెరలేపారని మంత్రి మండిపడ్డారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *