-ఆహ్వాన పత్రిక అందించిన దుర్గగుడి ఈవో, ప్రధాన అర్చకులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రి పై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 తేదీవరకు జరగబోయే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విచ్చేయాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను ఇంద్రకీలాద్రి ఆలయ ఈవో శీనా నాయక్ ఆహ్వానించారు. గురువారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ కు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామిఆలయ ఈవో శీనా నాయక్ , ప్రధాన అర్చకులు ఎల్.దుర్గా ప్రసాద్, వేద పండితులు శ్రీధర్ ఆహ్వానపత్రిక అందించారు. వేద పండితులు ఎంపి కేశినేని శివనాథ్ కి వేద ఆశీర్వచనం చేయటంతో పాటు అమ్మవారి తీర్ధ ప్రసాదాలు, శేష వస్త్రం అందజేశారు. ఆ తర్వాత ఇంద్రకీలాద్రి పై జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవ ఏర్పాట్ల గురించి ఎంపి కేశినేని శివనాథ్ అడిగి తెలుసుకున్నారు.
Prajavartha Online Telugu News