Breaking News

మెరుగైన వైద్యం కోసం ఎల్ .ఓ .సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన (లెటర్ ఆఫ్ క్రెడిట్) ఎల్.ఓ.సి ను గురువారం భవానిపురం
ఎన్డీఏ కార్యాలయంలో బీజేపీ నాయకులు దుర్బేసుల హుస్సేన్,కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తో కలిసి
అందజేశారు. 49వ డివిజన్ , ప్రైజర్ పేటకు చెందిన చెందిన త్రిపురనేని కమల (44) గర్భాశయ సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. తనకి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో ఎల్ .ఓ. సీ కొరకు దరఖాస్తు చేశారు. మంజూరైన రూ 1 లక్షల 83 వేల ఎల్. ఓ.సీ పత్రాన్ని బాధితురాలికి అందజేశారు. త్వరితగతిన ఎల్.ఓ.సీ మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు నున్న కృష్ణ, లెవిన్ బాబు, గన్నవరపు శ్రీనివాసరావు, దుర్బేశుల హుస్సేన్, కరిముల్లా, సాయి శరత్ సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *