-ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటిశ్రీధర్ తో కలిసి అందజేసిన కూటమి నేతలు
-56 వ డివిజన్ , రాజరాజేశ్వరి పేట కు చెందిన షేక్ షబీనాకు మంజూరైన రూ 1లక్ష 80 వేల ఎల్ .ఓ. సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను బాధితురాలికి ఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజా రాజేశ్వరి పేటకు చెందిన షేక్ షబీనా గర్భాశయ సమస్యతో బాధపడుతు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తనకు మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో టీడీపీ డివిజన్ అధ్యక్షుడు శ్యాంసుందర్ ఎల్ ఓ సీ కొరకు ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. మంజూరైన రూ 1 లక్ష 80 వేల ఎల్. ఓ. సీ ను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ ,బీజేపీ నాయకులు కరిముల్లా తో కలిసి అందజేశారు. అదేవిధంగా 56 వ డివిజన్, పాత రాజరాజేశ్వరి పేటకు చెందిన పులుపు రెడ్డి దుర్గ భవాని ( 22) కు రూ 1 లక్ష 50 వేల ఎల్ ఓ సీ ను అందజేశారు.. ఈ ఎన్ టీ సమస్యతో బాధపడుతున్న దుర్గ భవాని మెరుగైన వైద్యం కోసం ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నేతలు నున్న కృష్ణ, గన్నవరం శ్రీనివాసరావు, దుర్బేసుల హుస్సేన్, కరిముల్లా, సాయి శరత్, సుజనామిత్ర కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News