Breaking News

ఎం ఎల్ ఎ సుజనా చౌదరి ఆదేశాలతో మహిళల ఆరోగ్యం పై అవగాహన సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు తమ ఆరోగ్యంపై తప్పక శ్రద్ధ వహించాలని సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని అమ్మ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ శ్రీ లక్ష్మి అన్నారు. ఎం ఎల్ ఎ సుజనా చౌదరి ఆదేశాలతో పశ్చిమ లోని డ్వాక్రా, ఆర్పీలు, సమైక్య మరియు మహిళా సంఘాల సభ్యులకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. కేదారేశ్వరపేట, ఫ్రూట్ మార్కెట్ ప్రాంతంలోని వీ ఎం సీ కళ్యాణ మండపంలో గురువారం ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది మహిళల ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, అమ్మ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీ లక్ష్మి,
ఎ పి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రైనర్ సైదులు నాయక్, టాటా ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హెచ్ ఆర్ మేనేజర్ ఇమ్రాన్, బీజేపీ స్టేట్ సెక్రటరీ బొడ్డు నాగలక్ష్మి, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది రియాజ్ సుల్తానా, కమ్యూనిటీ ఆర్గనైజర్ విజయ భవాని, సుజనా మిత్రా కోఆర్డినేటర్ బొర్రా లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొని ఆరోగ్యం, నైపుణ్య శిక్షణ, పొదుపు సంఘాలలోని సమస్యల గురించి అవగాహన కల్పించారు

ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీ లక్ష్మి మాట్లాడుతూ మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మరియు మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి సారించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని అన్నారు. నేటి ఆధునిక జీవనశైలి కారణంగా వివిధ రుగ్మతలతో మహిళలు బాధపడుతున్నారని సమయానికి సరైన పోషకాహారం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. మహిళలు సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య చికిత్స పొందాలని సూచించారు. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ పరీక్షలను కూడా చేయించుకోవాలని తద్వారా ముందస్తు రోగ నిర్ధారణ సాధ్యమవుతుందన్నారు.

ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మాట్లాడుతూ పొదుపు సంఘాల సభ్యులు ఎవరికి ఒక రూపాయి కూడా లంచం ఇవ్వనవసరం లేకుండా పని చేయించుకోవాలని పొదుపు మహిళలకు సూచించారు. ఎవరైనా బలవంతపు వసూళ్లకు పాల్పడితే ఎన్డీఏ కార్యాలయంలో తెలియపరచాలని కోరారు.

ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రైనర్ సైదులు నాయక్ మాట్లాడుతూ కబేళా ప్రాంతంలో ఉన్న నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో మహిళలకు , కుట్టు శిక్షణ, బ్యూటీ, డిజిటల్ మార్కెటింగ్, స్మార్ట్ మీటర్ల లపై శిక్షణను ఇస్తున్నామని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *