-ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ హెచ్చరిక
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ హెచ్చరించారు. కనీసo గత మూడేళ్ల నుంచి నమోదవుతున్న కేసులకనుగుణంగా ప్రస్తుత సీజనల్ వ్యాధుల రాకను గమనించి అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరి ఎపిఐఐసి టవర్స్‌లోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
” గుంటూరు నగర శివారులోని తురకపాలెంలో సకాలంలో మరణాల నమోదులో క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అలక్ష్యం జరిగింది. జిల్లా నుంచి రాష్ట్ర పర్యవేక్షణ అధికారులకు సమాచారం అందలేదు. శాఖాపరమైన విచారణ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు ఉంటాయి. పారిశుద్ధ్యం లోపం, నీరు, ఆహారం కలుషిత ఘటనలతోనే సీజనల్ వ్యాధుల కేసులు ఎక్కువగా వస్తున్నాయి. సాధారణ స్థాయిలో కంటే కేసుల నమోదు ఎక్కువగా ఉంటే వెంటనే క్షేత్ర స్థాయి సిబ్బంది ఎందుకు గమనించలేకపోతున్నారు. . కాలానుగుణ వ్యాధుల రాకకు దారితీసే కారణాలు, సమస్యాత్మక ప్రాంతాల గురించి సిబ్బంది, అధికారులుకు తెలుసు. అయినా నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటారు. సంబంధిత శాఖల వారికి ఎందుకు వెంటనే తెలియజేయడంలేదు. ఉన్నతాధికారుల ద్రుష్టికి ఎందుకు తీసుకురావడంbలేదు. ఇకపై అలా జరగడానికి వేల్లేదు. విజయవాడలో డయేరియా కేసులు నమోదయినప్పుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంటనే సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ఇదే స్ఫూర్తితో జిల్లా అధికారులు వ్యవహరించాలి . కాలానుగుణ కేసుల గురించి సకాలంలో క్షేత్ర స్థాయి సిబ్బంది, పీహెచ్సీ వైద్యులు, జిల్లా అధికారులకు తెలియడంలేదంటే అక్కడ నిర్లక్ష్యం తీవ్రంగా ఉన్నట్లే ” అని వీరపాండియన్ జిల్లా వైద్య అధికారులకు స్పష్టంచేశారు.
Prajavartha Online Telugu News