Breaking News

జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజల కోసం నా చివరి శ్వాస వరకు సేవ చేస్తూనే ఉంటా… : నెట్టెం రఘురాం

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల అధ్యక్షులు నిర్వహించిన అభినందన సభలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “గత 40 ఏళ్లుగా జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాను. ఎన్టీ రామారావు నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు వరకు నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు సహకారం అందించాను. నాకు ఉన్న శక్తి, ఓపిక ఉన్నంతవరకు ఈ నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాను. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి నా కృతజ్ఞతలు. రైతులకు సకాలంలో రుణాలు అందించడమే నా ప్రధాన లక్ష్యం. దానిలో భాగంగానే ఈరోజు జగ్గయ్యపేట నియోజకవర్గంలోని అన్ని సొసైటీల ద్వారా రైతులకు రూ.12 కోట్లు మంజూరు చేశాము” అని తెలిపారు.

ఈ అభినందన సభకు విచ్చేసిన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని కి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కి, మాజీ ఎమ్మెల్సీ టి.డి. జనార్ధన్ కి, అలాగే కార్యక్రమం నిర్వహించిన అన్ని సొసైటీ అధ్యక్షులు మరియు రైతాంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ… “నెట్టెం రఘురాం అభినందన సభకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో సమస్యల పరిష్కారంలో ఆయన పెద్దదిక్కుగా నిలుస్తున్నారు. రైతులకు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించేందుకు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. భవిష్యత్తులో ఆయనకు మరిన్ని ఉన్నత స్థానాలు రావాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో కలిసి వేదాద్రి ఎత్తిపోతల పథకం, ముక్త్యాల, పోలంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల అభివృద్ధికి కృషి చేస్తున్నాము. పోలంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనుల కోసం ఎంపీ నిధులు కేటాయించాము. జగ్గయ్యపేట భౌగోళికంగా హైదరాబాద్–విజయవాడ మధ్యలో ఉండి కూడా పారిశ్రామిక అభివృద్ధి సాధించలేకపోయింది. అయితే, భవిష్యత్తులో డిఫెన్స్ క్లస్టర్ రాబోవడం శుభ సూచకం” అని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాత మాట్లాడుతూ… “నెట్టెం రఘురాంకి అభినందన సభ నిర్వహించడం ఆనందంగా ఉంది. ఆయనతో కలిసి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటాము. ఎంపీ గారితో కలిసి అవసరమైన మౌలిక సదుపాయాలను సాధించి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తాము” అన్నారు.

మాజీ ఎమ్మెల్సీ టి.డి. జనార్ధన్ మాట్లాడుతూ… “దశాబ్ద కాలం తర్వాత జగ్గయ్యపేటలో ఇలాంటి సభలో పాల్గొనడం ఆనందంగా ఉంది. నియోజకవర్గ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ PACS అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, రైతులు, అభిమానులు, బ్యాంక్ సిబ్బంది, సొసైటీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *