Breaking News

తిరుపతిని గ్లోబల్ వెడ్డింగ్ డెస్టినేషన్, మైస్ టూరిజం ప్రాంత౦గా అభివృద్ధి చేయాలి

-టూరిజం పెట్టుబడిదారుల సమస్యల పరిష్కారం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు : జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్
-టెంపుల్, ఎకో,మైస్ టూరిజం అభివృద్ధి కి రూట్ మ్యాప్ రూపొందించాలి : తిరుపతి ఎం.ఎల్.ఏ ఆరణి శ్రీనివాసులు
-తిరుపతి జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దడానికి పర్యాటక శాఖ మంత్రి వర్యులు విశేష కృషి చేస్తున్నారు : సూళ్ళూరు పేట ఎం.ఎల్.ఏ నెలవల విజయశ్రీ
-తిరుపతి జిల్లాలో టూరిస్ట్ ల హబ్ గా శ్రీకాళహస్తి ని ప్రథమ స్థానం లో నిలుపుతాము : శ్రీకాళహస్తి ఎం ఎల్.ఏ బొజ్జల సుదీర్ రెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతిని గ్లోబల్ వెడ్డింగ్ డెస్టినేషన్, మైస్ టూరిజం ప్రాంత౦గా అభివృద్ధి చేయాలని, టూరిజం పెట్టుబడిదారుల సమస్యల పరిష్కారం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ తెలిపారు.
.
శుక్రవారం స్థానిక తాజ్ హోటల్ నందు నిర్వహించిన ప్రాంతీయ పర్యాటక పెట్టుబడుదారుల సమావేశంనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అజయ్ జైన్,పర్యాటక శాఖ సి.ఈ.ఓ, ఎం.డి, ఆమ్రపాలి కాట, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, తిరుపతి, సూళ్ళూరుపేట, శ్రీ కాళహస్తి ఎం.ఎల్.ఏ లు ఆరణి శ్రీనివాసులు, నెలవల విజయశ్రీ, బొజ్జల సుదీర్ రెడ్డి, గ్రీన్ అండ్ బ్యుటిఫికేషన్ కార్పోరేషన్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ కార్పోరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, హ్యండీ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, టూర్ ఆపరేటర్ అసోసియేషన్ విజయమోహన్, సిఐఐ చైర్మన్ దామోదర్ నాయుడు లతో కలిసి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త టూరిజం పాలసీ వచ్చిన తర్వాత టూరిజం కి ఇండస్ట్రీ స్టేటస్ ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగిందని, తద్వారా గడచిన 14, 15 నెలల్లో అధిక మొత్తంలో తిరుపతి జిల్లాకు పెట్టుబడి దారులు పెట్టుబడులు పెట్టడానికి రిక్వెస్ట్స్ డిమాండ్స్ వచ్చాయని, దీనికి సంబందించి జిల్లా యంత్రాంగం నుంచి ల్యాండ్ పూల్ ని రెడీ చేసుకున్నామన్నారు. ఏ టైప్ ఆఫ్ హోటెల్స్ కి ఏ టైప్ ఆఫ్ ల్యాండ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ పెట్టాలి, కన్వెన్షన్ సెంటర్స్ కి ఎటువంటి ల్యాండ్ పెట్టాలి అనేది చాలా ల్యాండ్స్ ని కూడా గుర్తించడం జరిగిందన్నారు. ముఖ్యంగా మనకి తిరుపతి సిటీలో కూడా ఆవిలాల, దామినేడు శెట్టిపల్లి పరిసర ప్రాంతాల లో ఉన్న ల్యాండ్స్ లో కూడా చాలా గుర్తించడం జరిగిందన్నారు. తిరుపతిలో లెమన్ ట్రీ హోటల్, కోర్ట్ యార్డ్ మ్యారియాట్, ఒబెరాయ్ త్వరలో స్టార్ట్ అవ్వబోతాయని అతి త్వరలోనే మనకి నోవోటెల్ హోటల్ ఫౌండేషన్ జరగవచ్చునని అన్నారు. తిరుమల, శ్రీకాళహస్తీ, కాణిపాకం, తిరుచానూరు తదితర దేవాలయాలకు దర్శన౦ కోసం అదిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని తిరుపతిలో మనకి స్పిరిచువల్ టూరిజంకి చాలా అవకాశాలు ఉన్నాయని, ఇది ఒక సర్క్యూట్ లో పెట్టుకుంటే ఖచ్చితంగా కూడా మనకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు మేరకు కనీసం 2 నుండి 3 రోజులు తిరుపతిలో బస చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుపతి/తిరుమల లో పెళ్లి చేసుకోడానికి చాలా మంది ఆసక్తి చూపుతారని టూరిజం డిపార్ట్మెంట్ టిటిడి వాళ్ళతో సమన్వయము చేసుకొని తిరుపతి/తిరుమలని ఒక గ్లోబల్ వెడ్డింగ్ డెస్టినేషన్ గా చేసినట్లయితే తిరుపతి ఒక మరింత పర్యాటక ప్రాతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మైస్ టూరిజం ను తిరుపతి లో అబివృద్ది చేయడానికి పలు అవకాశాలు ఉన్నాయని అన్నారు. రానున్న రెండు రోజుల్లో తిరుపతి లో జాతీయ మహిళా సాదికార సదస్సు జరుగుతుందని, ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలకు సంబందించిన ప్రముఖులు పాల్గొననున్నారని దేశంలోనే తిరుపతి లో ఇలాంటి ఒక పెద్ద సదస్సులు జరగడం వలన తిరుపతి లోని హోటెల్స్ ,కన్వెన్షన్ సెంటర్స్ అండ్ వెడ్డింగ్ హాల్స్ అన్నింటిలో కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నారు. తిరుపతి జిల్లాలోని చేనేత వస్త్రాలు, కలంకారి సారీలు, వెంకటగిరి సారీలు, పాపానాయుడు పేట బీట్స్, అన్నింటిని ప్రచారం చేయడం వలన ఆ ప్రాంతాలు మరింత పర్యాతకంగా అభివృద్ధి చేడుతాయన్నారు. పులికాట్, నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రాలను టూరిజం డెస్టినేషన్‌గా అభివృద్ధి చేయాలని అన్నారు. తిరుపతి జిల్లాకు 75 కిలోమీటర్ల కోస్తా తీరం ఉందని, తూపలిపల్లెం బీచ్‌లో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు గూళ్లు పెడుతున్నాయని, శ్రీహరికోట, షార్‌ను కలుపుతూ ఏరోస్పేస్ టూరిజం అభివృద్ధి చేయవచ్చునన్నారు. ఇస్రో, షార్‌ను సందర్శించడానికి విద్యార్థులకు అనుమతిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులు వస్తున్నాయని, ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో జలపాతాలు కలవని వాటిని కూడా ప్రోత్సహించాలని చూస్తున్నామన్నారు.

తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుప‌తి చుటుప‌క్క‌ల ప్రాంతాల్లో టెంపుల్ టూరిజం తోపాటు, ఎకో టూరిజం, మైస్ టూరిజం అభివృద్ధికి రూట్ మ్యాప్ రూపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ప్రాతినిథ్యం వ‌హించిన తిరుప‌తిని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు చెప్పారు. పెట్టుబ‌డిదారుల‌కు ఏ విధ‌మైన స‌మ‌స్య వ‌చ్చినా అధికారుల చ‌ర్చించి ప‌రిష్కారానికి కృషి చేస్తామ‌ని మాట ఇచ్చారు. పిపిపి మోడ‌ల్ లో పెట్టుబ‌డులు పెడుతున్న ఇన్ వెస్ట‌ర్స్ కు ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప్ర‌భుత్వం బాధ్య‌త‌లు తీసుకుంటుంద‌ని తెలిపారు.

సూళ్ళురుపేట ఎమ్మెల్యే మాట్లాడుతూ .. తిరుపతి జిల్లా సూళ్ళురుపేట నియోజకవర్గం లో ఉన్న పులికాట్ సరస్సు, గత ఏడాది ఫ్లెమింగో ఫెస్టివల్ ను, ఇరకం దీవి ని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించి ఆ ప్రాంతలు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందేల జిల్లా కలెక్టర్ కు పలు సూచనలు ఇచ్చారని అన్నారు. బి.వి పాలెం దగ్గర బోట్స్ ఫెసిలిటీ ఉందని అక్కడ రిసార్ట్స్ ఏర్పాటు చేయడం కోసం అన్ని ప్రణాళికలు తయారు చేసి ముందుకు తీసుకెలుతున్నామని తెలిపారు. మన జిల్లాను పర్యాటక ప్రాతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న పర్యాటక శాఖా మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంతో విజన్ ఉన్న ఒక నాయకుడు అని తెలిపారు. తిరుమల దర్శనానికి వచ్చే వారికి రూమ్స్ లేక ఇబ్బందులు పడుతున్నారని, ఒక రోజుకు మించి ఉండడానికి వసతి లేదని కావున వారు చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా అక్కడ రిసార్ట్స్ , హోమ్ స్టే లు ఏర్పాటు చేయాలనీ కోరారు.

శ్రీ కాళహస్తి ఎం.ఎల్ ఏ మాట్లాడుతూ .. తిరుపతి జిల్లాలో టూరిస్ట్ హబ్ గా శ్రీకాళహస్తిని ప్రథమ స్థానంలో నిలుపుతామని అన్నారు. శ్రీకాళహస్తి ఆలయము గుడిమల్లం ఆలయాన్ని అనుసంధానిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. శ్రీకాళహస్తి ని భవిష్యత్తులో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

యాదవ కార్పోరేషన్ చైర్మన్ మాట్లాడుతూ విశాఖపట్నం, విజయవాడ పలు ప్రాంతాలలో టూరిజం లో జరుగుతున్న అభివృద్ధి తిరుపతికి వచ్చేసరికి ఎందుకు వెనకబడుతున్నామని ఆలోచించి గతంలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్నప్పుడు మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు. అలివేలుమంగాపురం, , శ్రీకాళహస్తి,ముక్కోటి లాంటి తదితర పర్యాటక ప్రాంతాలను పి పి పి(పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్) మోడల్ లో మార్క్ చేయడం జరిగిందని తెలిపారు. తిరుమల దర్శనార్థం వచ్చే వారు బస చేయడానికి హోమ్ స్టే లు ఏర్పాటు చేయాలని తద్వారా ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా ఇంకా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

హ్యాండి క్రాఫ్ట్స్ చైర్మన్ మాట్లాడుతూ .. తిరుపతి లోని స్వామీ వారి దర్శనానికి వచ్చు భక్తులను యాత్రికులుగా మార్చగలిగితే పర్యాటక౦గా తిరుపతిని మరింత అభివృద్ధి చేయవచ్చునని అందులో భాగంగా దర్శనానికి వచ్చు భక్తులు బస చేయడానికి హోమ్ స్టే, హోటళ్ళను పెంచి తద్వారా వసతి కల్పించాలన్నారు. దర్శన టికెట్ లను ఆన్లైన్ కాకుండా ఆఫ్ లైన్ లో కూడా అందుబాటులో ఉంచాలన్నారు. హ్యాండీ క్రాఫ్ట్స్ మాదవమాల , వెంకటగిరి, కుప్పం, కలంకారీ, నారాయణవనం తదితర ప్రాంతాలను పర్యటించేల ప్రమోట్ చేయడం వలన చేనేత రంగం తో పాటు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నారు.

గ్రీన్ అండ్ బ్యుటిఫికేషన్ చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, నారా లోకేశ్ ఈ రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనీ కృషి చేస్తున్నారన్నారు. తిరుపతి ప్రజలు, యువత అందరూ అవకాశాలను ప్రభుత్వ అందిస్తున్న సహాయ సహకారాలను అందిపుచ్చుకుని ముందుకెళ్లాలన్నారు,తిరుపతి నగరం ప్రపంచ వ్యాప్తంగా ఆద్యాత్మికంగా ఎదుగుతూ ఉందని ఆ దిశగా పర్యాటక రంగంలో కూడా ముందుకెలుతుoదన్నారు. పి.పి.పి మోడల్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసె దిశగా ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించుకోవడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో టూరిజం ఆర్.డి రమణ ప్రసాద్, జిల్లా టూరిజం అధికారి జనార్ధన రెడ్డి, ఇన్వెస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *