తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తడ లో బుధవారం (17-09-2025) జాబ్ మేళా నిర్వహించబడును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో 17-09-2025 తేదీన అనగా బుధవారం ఉదయం 8 గంటల నుంచి గవర్నమెంట్ ఐటిఐ ,తడ (Govt ITI, Tada) నందు జాబ్ మేళా నిర్వహించబడును. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలోని చదువుకుని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం శ్రీ సిటీ , తిరుపతి, మరియు చెన్నైలోని 10 బహుళ జాతీయ కంపెనీలలో 400 పైగా ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును. ఇందులో భాగంగా జిల్లాలోని పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీలో లేదా పీజీలో ఉత్తీర్ణత అయిన యువతి యువకులు ఈ జాబ్ మేళా కు అర్హులు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ యువకులు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింక్ లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.మరిన్ని వివరాలకు క్రింద తెలుపబడిన మొబైల్ నెంబర్లను సంప్రదించగలరు అని ఆర్ లోకనాథం, జిల్లా నైపుణ్యా అభివృద్ధి సంస్థ అధికారి, తిరుపతి జిల్లా మరియు ఎం దేవదానం, గవర్నమెంట్ ఐటిఐ, తడ సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలియజేశారు.
రిజిస్ట్రేషన్ లింకు: https://naipunyam.ap.gov.in/user-registration
రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 15-09-2025. మరియు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా కలదు.
ఇతర వివరములు కొరకు సంప్రదించండి:9121646661, 9988853335.(కాల్ సెంటర్).
గమనిక: జాబ్ మేళాకు( ఇంటర్వ్యూలకు) హాజరయ్యా యువతి యువకులు పైన ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింకులో ఆధార్ ఓటిపి తో ట్రైనీ (Trainee Registration) రిజిస్ట్రేషన్ చేసుకొని మరియు మీ ప్రొఫైల్ లాగిన్ అయ్యి అన్ని కంపెనీలకు అప్లై చేసుకుని అడ్మిట్ కార్డుతో ఇంటర్వ్యూలకు హాజరవ్వ వలెను
Prajavartha Online Telugu News