Breaking News

శిల్పకారుల ప్రతిభకు పురస్కారం – లేపాక్షి హస్తకళల డిజైన్ అవార్డులు 2025

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అమ్మ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్ డిజైన్ పోటీ – అవార్డుల కార్యక్రమం 2025 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు హాజరై అవార్డులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ మాట్లాడుతూ – “హస్తకళాకారుల జీవన ప్రమాణం మెరుగుపడితేనే ఆ కళలు భవిష్యత్తు తరాలకు అందుబాటులోకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం లేపాక్షి లక్ష్యం. రానున్న కాలంలో రాష్ట్రానికి చెందిన ప్రతి ఉత్పత్తికి జీ ఐ సాధించేలా కృషి చేస్తాం. శిల్పకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే వేదికగానే లేపాక్షి అవార్డులు నిలుస్తాయి” అని అన్నారు.

కార్యక్రమానికి చేనేత – జౌళి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ అవార్డులు శిల్పకారుల ప్రతిభను మాత్రమే కాకుండా, రాష్ట్ర సంప్రదాయ కళలకు ప్రోత్సాహాన్ని కూడా ప్రతిబింబించాయని పేర్కొన్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ మనోహరన్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

అవార్డులు
కొండపల్లి, ఎటికొప్పాక, వుడ్ కార్వింగ్, తోలుబొమ్మలు, కలంకారీ బ్లాక్ ప్రింటింగ్ విభాగాల్లో పోటీ నిర్వహించారు. నిపుణుల జ్యూరీ ద్వారా ఎంపికైన శ్రేష్ఠమైన కృతులకు అవార్డులు ప్రదానం చేశారు. మొత్తం 15 అవార్డులకు గాను గోల్డ్, సిల్వర్, బ్రోంజ్ మెడల్స్‌తో పాటు సర్టిఫికెట్లు, నగదు బహుమతులు కలిపి రూ.3 లక్షలు పంపిణీ చేశారు.

బంగారు పతక విజేతలు:
నూతక్కి శ్రీనివాసరావు – కొండపల్లి బొమ్మలు (శ్రీనివాస కల్యాణం)
టాంగేటి అయ్యన్న – ఎటికొప్పాక బొమ్మలు (మల్టీపర్పస్ యుటిలిటీ బాక్స్)
దలవాయి ఆనంతమ్మ – తోలుబొమ్మలు (టేబుల్ ల్యాంప్ షేడ్)
సుబ్రహ్మణ్య ఆచార్య – వుడ్ కార్వింగ్ (షోకేస్ ఐటమ్)
కె.వి.ఎస్.ఎన్. కిషోర్ – కలంకారీ బ్లాక్ ప్రింటింగ్ (వాల్ పెయింటింగ్ క్లాత్)

అదనంగా ఐదుగురు శిల్పకారులు ప్రత్యేక అవార్డులు అందుకున్నారు. ఒక్కొక్కరికి రూ.10,000 నగదు బహుమతి, సర్టిఫికెట్లు అందజేశారు.

ప్రదర్శన – అమ్మకాలు
కార్యక్రమంలో భాగంగా గాంధీ శిల్ప్ బజార్, మాస్టర్‌పీసెస్ ప్రదర్శన – అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రదర్శన సెప్టెంబర్ 14 వరకు కొనసాగనుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *