Breaking News

16వ తేదీన జరగనున్న కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదనను ఆమోదించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంబేద్కర్, ఆలయ నిర్మాణానికి విజయవాడ మున్సిపల్ కౌన్సిల్లో రెండవ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మల కుమారి, ప్రతిపాదన చేయడం హర్షణీయ మని అంబేద్కర్, ఆలయ కమిటీ అధ్యక్షులు అంబడిపూడి రవి ప్రకాష్ వెల్లడించారు. 16వ తేదీన జరగనున్న కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదనను ఆమోదించాలని వి.యం.సి. కౌన్సిల్ సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు. బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి కౌన్సిల్ లో రెండవ డివిజన్ కార్పొరేటర్ అంబటిపూడి నిర్మలకుమారి ప్రతిపా దించారన్నారు. రాజ్యాంగ నిర్మాణమే కాకుండా, అనేక రచనల ద్వారా ప్రజలలో మార్పు తీసుకు వచ్చిన బాబా సాహెబ్ అంబేద్కర్, మహనీయుడు అన్నారు. ఆయనను అనేకమంది దేవుడిగా భావిస్తున్నారన్నారు. అలాంటి మహనీయుడికి గుడి కట్టాలన్న ప్రతిపాదనలను కౌన్సిల్ సభ్యులు అందరూ ఆమోదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జాన్ రత్నం, గుండె సుందర పాల్, పెద్దిపోయిన శ్రీనివాస్, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *