జగయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న నాలుగు డి ఏ లను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయ్యాలని జిల్లా అధ్యక్షులు కె సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేసారు. స్థానిక ఎన్జీఓస్ హోమ్ నందు జగయ్యపేట తాలూకా యూనిట్ అధ్యక్షులు కె వెంకట్రావు అధ్యక్షతన సర్వ సభ్య సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశంనకు ముఖ్య అతిధులుగా ఏపీ ఎన్జీజీఓస్ అసోసియేషన్ పశ్చిమకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కె సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి పి రమేష్ హాజరైనారు.
జిల్లా అధ్యక్షులు కె సత్యనారాయణ రెడ్డి కార్యదర్శి పి రమేష్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సంఘం ఏపీ ఎన్జీజీఓస్ సంఘమని, 70 సంవత్సరాల చరిత్ర కలిగి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు అనేక రాయితీలను ప్రభుత్వం నుండి కల్పించిన సంఘం ఏపీ ఎన్జీజీఓస్ సంఘమని ఆయన అన్నారు. ఉద్యోగుల డిమాండ్ల సాధనకై ప్రభుత్వాలపై ఉద్యమాలు చేసినా సందర్భాలు కూడా అనేకమున్నాయన్నారు. ఉద్యోగులుగా మేము ప్రభుత్వం దగ్గర దాచుకున్న జీపిఎఫ్, ఏపీజీఎల్ఐ డబ్బులను కూడా అవసరాలకు తిరిగి తీసుకోలేని పరిస్థితి గతంలో ఉండేదని, కొత్త కూటమి ప్రభుత్వం వచ్చాక నుమారు7500 కోట్ల రూపాయల జీపిఎఫ్ ఏపీజీఎల్ఐ బిల్లులు మంజూరు చెయ్యడం జరిగిందన్నారు. జీపిఎఫ్, ఏపీజీఎల్ఐ బిల్లులను ఎప్పటికప్పుడు పరిషరించేవిధంగా ప్రభుత్వంతో మాట్లాడి చేసిన రాష్ట్ర అధ్యక్షులు ఎ విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి డివి రమణ లపై ఉద్యోగుల నమ్మకం మరెంత పెరిగిందన్నారు. పెండింగ్ లో ఉన్న డీఏ లను కూడా పండుగకు ముందే ప్రభుత్వం నుండి ఇప్పిస్తారనే ఆశాభావంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారని ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని తాలూకా యూనిట్ల పరిధిలోని ప్రభుత్వ శాఖలలో పనిచేసే అధికారులు ఉద్యోగులతో ఏపీ ఎన్జీజీఓస్ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తుంటే ఉద్యోగుల నుండి విశేష స్పందన వస్తుందని ఆయన తెలిపారు. ఎన్జీజీఓస్ మాసపత్రిక అయిన ఎన్జీఓస్ సమాచారంను కూడా ప్రతి ఉద్యోగికి ఉపాధ్యాయునికి అందేవిధంగా చూడాలని జగయ్యపేట తాలూకా యూనిట్ కార్యవర్గాన్ని కోరారు.
ఈ సమావేశంలో ఏపీ ఎన్జీజీఓస్ జిల్లా ఉపాధ్యక్షులు యం రాజుబాబు, ఆర్ శ్రీనివాసరావు, జి రామకృష్ణ, తాలూకా యూనిట్ కార్యదర్శి టి బాబూరావు, యూటీఫ్ జిల్లా ఉపాధ్యక్షులు యం కృష్ణయ్య, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం జగయ్యపేట అధ్యక్షులు అర్బన్ అలీ, కార్యదర్శి యం కోటేశ్వరరావు, గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోశాధికారి పుల్లారావు, ఏపీ ఎన్జీజీఓస్ నాయకులు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News