Breaking News

స‌రికొత్త చ‌రిత్ర‌కు నాంది విజ‌య‌వాడ ఉత్స‌వ్

-పున్న‌మి ఘాట్ వేదిక‌గా విజ‌య‌వాడ ఉత్స‌వ్ ప్రారంభోత్స‌వ వేడుక‌లు
-సోమ‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు విజ‌య‌వాడ ఉత్స‌వ్ వేడుక‌లు ప్రారంభం
-ముఖ్యఅతిథిగా హాజ‌రు కానున్న మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌రపు వెంక‌య్య‌నాయుడు
-విజ‌య‌వాడ ఉత్స‌వ్ వేడుక‌ల‌ను ప్రారంభించ‌నున్న విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్‌
-త‌మ్మల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం లో 13 నాటకాలు, ఘంట‌సాల సంగీత క‌ళాశాల‌లో 12 నాట‌కాలు
-విజ‌య‌వాడ ఉత్స‌వ్ అఫిషియ‌ల్ వీడియో సాంగ్ లాంచ్ చేసిన టిడిపి సీనియ‌ర్ నేత వ‌ర్ల రామయ్య‌

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాన‌దీ తీరాన అమ్మ‌వారి ఆశీస్సులతో ఏదైనా న‌గ‌రం వుందంటే అది విజ‌య‌వాడేన‌ని గ‌ర్వంగా చెప్పుకోవ‌చ్చు. బార‌త‌దేశం మొత్తం విజ‌య‌వాడ వైపు తిరిగి చూసే విధంగా సెప్టెంబ‌ర్ 22నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు విజ‌య‌వాడ ఉత్స‌వ్ జ‌ర‌గ‌బోతుందని టిడిపి పోలిట్ బ్యూరో స‌భ్యులు వ‌ర్ల‌రామయ్య అన్నారు. విజ‌య‌వాడ ఉత్స‌వ్ సంద‌ర్భంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మ‌ వివ‌రాలు తెలిపేందుకు విజ‌య‌వాడ ఉత్స‌వ్ క‌మిటీ స‌భ్యులు కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ ఆధ్వ‌ర్యంలో ఆదివారం ముర‌ళీ ఫార్చ్యూన్ హోట‌ల్ మీడియా సమావేశం జ‌రిగింది

ఈ సమావేశంలో ఏపీ క్రియేటివ్ అండ్ క‌ల్చ‌ర‌ల్ క‌మీష‌న్ చైర్మ‌న్ పొడ‌పాటి తేజ‌స్వీని, ఏపీ నాట‌క అకాడ‌మీ చైర్మ‌న్ గుమ్మ‌డి గోపాల‌కృష్ణ‌,జిజ్ఞాస ఆర్ట్ వ‌ర్స్స్ క్యూరేట‌ర్ వైష్ణ‌వి , విజ‌య‌వాడ ఉత్స‌వ్ క‌మిటీ స‌భ్యులు అనిల్ సుంక‌ర పాల్గొన్నారు. ఈ సమావేశంలో విజ‌య‌వాడ ఉత్స‌వ్ కి సంబంధించి గేయ ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి రచించిన పాటకు విజ‌య‌వాడ ఉత్స‌వ్ క‌మిటీ స‌భ్యులు ప్ర‌ముఖ నిర్మాత అనిల్ సుంక‌ర ఆధ్వ‌ర్యంలో సిద్ద‌మైన విజ‌య‌వాడ ఉత్స‌వ్ అఫిషియ‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ వీడియో సాంగ్ ను వ‌ర్ల రామ‌య్య ఆవిష్క‌రించారు.

అలాగే సెప్టెంబ‌ర్ 22 నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు జ‌రిగే విజ‌య‌వాడ ఉత్స‌వ్ కార్య‌క్ర‌మ వివ‌రాలు తెలిపారు. ఇక సోమ‌వారం 6 గంట‌లకు పున్న‌మి ఘాట్ లో విజ‌య‌వాడ ఉత్స‌వ్ ప్రారంభ వేడుక‌లు ఘ‌నంగా ప్రారంభం కానున్నాయి. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు హాజ‌రు కానుండ‌గా, విజ‌య‌వాడ ఉత్స‌వ్ వేడుక‌ల‌ను రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించ‌టానికి విచ్చేయ‌నున్నారు.

ఈ స‌మావేశానికి స‌భాధ్య‌క్ష‌త వ‌హించిన విజ‌య‌వాడ ఉత్స‌వ్ ఆర్గ‌నైజింగ్ కమిటీ స‌భ్యులు కొమ్మారెడ్డి ప‌ట్టాబిరామ్ మాట్లాడుతూ సెప్టెంబ‌ర్ 22 నుంచి అక్టోబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు అత్యంత ఘ‌నంగా విజ‌య‌వాడలో క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ‌వారి ద‌స‌రా ఉత్స‌వాలు అత్యంత ఘ‌నంగా మొదలు కానున్నాయన్నారు. ఈ ఏడాది ప‌ద‌కొండు రోజుల పాటు ద‌స‌రా ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయ‌న్నారు. . ప్ర‌భుత్వ ప‌రంగా చేయాల్సిన ఏర్పాట్లున్నీ ఎండోమెంట్ డిపార్ట‌మెంట్ , వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో అద్బుతంగా జ‌రుగుతున్నాయని వివ‌రించారు.

ద‌స‌రా ఉత్స‌వాల‌కి మ‌రింత వైభ‌వాన్ని తీసుక‌వచ్చే విధంగా విజ‌యవాడ న‌గరంలో ఎంపీ కేశినేని శివ‌నాథ్ , ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని అంద‌రూ ప్ర‌జా ప్ర‌తినిధులు, సీనియ‌ర్ నాయ‌కులు, వివిధ కార్పొరేష‌న్ల చైర్మ‌న్ల , న‌గ‌ర ప్ర‌ముఖుల‌ను స‌మ‌న్వ‌య ప‌ర్చుకుంటూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ , విద్య‌, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ స‌ల‌హాలు సూచ‌నలు తీసుకుంటూ విజ‌య‌వాడ ఉత్స‌వ్ కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేయ‌టం జ‌రిగిందన్నారు.

ఈ విజ‌య‌వాడ ఉత్స‌వ్ లో భాగంగా న‌గ‌రంలోని ఐదు ప్రాంతాల్లో వేదిక‌ల‌ను ఏర్పాటు చేసి అక్క‌డ‌ వివిధ సాంస్క‌తిక , అధ్యాత్మిక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయ‌టం జ‌రిగిందన్నారు. విజ‌య‌వాడ ఉత్స‌వ్ లో భాగంగా విజ‌య‌వాడ చారిత్ర‌క సాంస్కృతిక వైభ‌వం ప్ర‌తిబింబిలా అనే క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు, పౌర‌ణిక నాట‌కాలు, ప‌ద్య నాట‌కాలు, సాంఘిక నాట‌కాలు, కూచిపూడి, భ‌ర‌త‌నాట్యం నృత్యాలు వంటి కార్య‌క్ర‌మాలు రాష్ట్ర క్రియేటివ్ అండ్ క‌ల్చ‌ర‌ల్ క‌మీష‌న్ చైర్మ‌న్ పొడ‌పాటి తేజస్వి, ఆంధ్రప్రదేశ్ నాటక రంగ కార్పొరేషన్ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ , క‌ళాభిమాని టిడిపి పొలిట్ బ్యూరో స‌భ్యులు వర్ల రామ‌య్య స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకుంటూ రూప‌క‌ల్ప‌న చేయ‌టం జ‌రిగిందన్నారు. ఈ కార్య‌క్ర‌మాల‌ను తుమ్మ‌ల‌పల్లి క‌ళాక్షేత్రం, పున్న‌మి ఘాట్, ఘంట‌సాల మ్యూజిక్ కళాశాల‌లో ఏర్పాటు చేయ‌టం జ‌రిగిందని పేర్కొన్నారు. అలాగే జిజ్ఞాస ఆర్ట్ వ‌ర్క్స్ సంస్థ న‌గ‌రంలోని ప‌లు కాలేజీల్లో అనే పోటీలు నిర్వ‌హిస్తుందన్నారు. ఈ సంస్థ క్యూరేట‌ర్ వైష్ణ‌వి ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. . పున్న‌మి ఘాట్ లో విజ‌య‌వాడ తో పాటు ఎన్టీఆర్ జిల్లా చ‌రిత్ర ఏ విధంగా మొద‌లైంది,పయ‌నం ఎలా సాగింది. ఎంత మంది ప్ర‌ముఖుల కృషి ఎంత వుంద‌నే విష‌యాలు తెలిసే విధంగా ఒక గ్యాల‌రీ ఏర్పాటు చేయ‌టం జ‌రిగిందన్నారు.

ఇక విజ‌య‌వాడ ఉత్స‌వ్ కార్య‌క్ర‌మానికి ఉప‌రాష్ట్ర‌ప‌తి రాధ‌కృష్ణ‌న్ రానున్న‌ట్లు తెలిపారు. శ‌నివారం ఎంపీ కేశినేని శిన‌వాథ్ ఢిల్లీ వెళ్లి వారిని ఆహ్వానించ‌టం జ‌రిగింద‌న్నారు. త‌ప్ప‌క వస్తాన‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి రాధ‌కృష్ణ‌న్ చెప్పార‌న్నారు. ఇక ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ బంద‌ర్ రోడ్డులో మూడు వేల మంది ద‌స‌రా వేషాధార‌ణ తో జ‌రిగే కార్నివాల్ కు రానున్న‌ట్లు తెలిపారు. ఇక ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ వారి కుటుంబ స‌భ్యుల‌తో హాజ‌రు కానున్న‌ట్లు తెలిపారు. అలాగే వివిధ రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్లు, కేంద్ర మంత్రులు వ‌స్తార‌న్నారు.

ముఖ్యఅతిథిగా హాజరైన‌ వ‌ర్ల రామ‌య్య మాట్లాడుతూ గ‌త ఐదేళ్లుగా రాష్ట్రంలో సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు లేకుండా పోయాయన్నారు. రాజ‌కీయ ర‌ణ‌రంగాలు త‌ప్పితే, అస‌లు ప్ర‌జ‌ల‌కు కావాల్సిన మాన‌సిక ఉల్లాసం కోసం వైసిపి ప్ర‌భుత్వం చేయ‌లేదన్నారు. విజ‌య‌వాడ ఉత్స‌వ్ లాంటి కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నందుకు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు అభినంద‌న‌లు తెలిపారు.

త‌ను ప‌ద‌కొండు రోజులు తుమ్మ‌ల‌పల్లి క‌ళాక్షేత్రంలోనే వుంటాన‌న్నారు.విజ‌య‌వాడ ప‌రిస‌ర ప్రాంతాల్లో పౌరాణిక‌, ప‌ద్య‌, సాంఘిక నాట‌కాలు చూడాల‌నుకున్న ఆస‌క్తి వున్న ప్ర‌జ‌లు చాలా మంది వున్నారని తెలిపారు. . ఒక‌ప్ప‌డు విజ‌య‌వాడ సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌కు కేంద్రంగా వుండేదన్నారు. టీవీ లోకంగా మారిన ఈ రోజుల్లో ప్ర‌జ‌ల‌కు బ‌య‌ట‌కి రావ‌టానికి విజ‌య‌వాడ ఉత్స‌వ్ కార్య‌క్ర‌మం ఎంతో దోహ‌ద‌ప‌డుతున్నారు.

విజ‌య‌వాడ ఉత్స‌వ్ పై విమ‌ర్శ‌లు చేసే వైసిపి నాయ‌కులపై మండిప‌డ్డారు. దేశం న‌లుమూల నుంచి ప్ర‌ముఖులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు రాబోతున్నారని, ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను చెడ‌గొట్ట‌టానికి వైసిపి నాయ‌కులు కంక‌ణం క‌ట్టుకున్నార‌ని, వారి విమ‌ర్శ‌లు ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేద‌న్నారు. తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం, పున్న‌మి ఘాట్ లో ఎపీ నాట‌క అకాడ‌మీ చైర్మ‌న్ గుమ్మ‌డి గోపాల కృష్ణ ఆధ్వ‌ర్యంలో పౌరాణిక‌, ప‌ద్య‌, సాంఘిక నాట‌కాలు జ‌రుగుతాయ‌న్నారు. ప్ర‌జ‌ల‌ను సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో రంజింప చేయాల‌నే ద్యేయంతో ఎంపీ కేశినేని శివనాథ్ ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయ‌టం జ‌రిగింద‌న్నారు.

ఏపీ క్రియేటివ్ అండ్ క‌ల్చ‌ర‌ల్ క‌మీష‌న్ చైర్మ‌న్ పొడ‌పాటి తేజ‌స్వీని మాట్లాడుతూ విజ‌య‌వాడ ఉత్స‌వ్ లో
జాన‌ప‌ద‌క‌ళ‌లు, కూచిపూడి నాట్యం, ఆంధ్ర నాట్యం, క‌థ‌క్, ఇలాంటి క్లాసిక‌ల్ డ్యాన్స్ ల‌తో పాటు సంగీతం, ట్రేడిష‌న్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, క్లాసిక‌ల్ మ్యూజిక్ అన్ని సాంస్కృతిక క‌ళ‌ల‌తో విజ‌య‌వాడ న‌గ‌రం క‌ళ‌క‌ళాడ‌బోతుందన్నారు. ఈ కార్య‌క్ర‌మాలు న‌గ‌రంలో తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం, ఘంట‌సాల ప్ర‌భుత్వ సంగీత క‌ళాశాల‌, పున్న‌మి ఘాట్ లు వేదిక‌గా ఏర్పాటు చేయ‌టం జ‌రిగిందన్నారు. అంత‌రించిపోతున్న క‌ళ‌ల‌కు పున్వ‌రైభ‌వం కలిగించే విధంగా, ప్ర‌జ‌ల‌కు చేరువ చేసే విధంగా ఈ ప్ర‌ణాళిక రూపొందించ‌టం జ‌రిగింద‌న్నారు.

మ‌న సంస్కృతి సంప్ర‌దాయాలు తెలియ‌జేసే నాట్య రూపాలు కానీ, జాన‌ప‌ద నృత్యాలు కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో చూసే అవ‌కాశం లేకుండా పోయింద‌న్నారు.2018 త‌ర్వాత క‌ళాకారులు అంద‌రూ క‌లిసి చేసిన కార్య‌క్ర‌మం ఒక‌టి జ‌ర‌గ‌లేదన్నారు. దాదాపు ఏడేళ్ల త‌ర్వాత విజ‌య‌వాడ‌లో అలాంటి కార్య‌క్ర‌మం విజ‌య‌వాడ ఉత్స‌వ్ ద్వారా జ‌ర‌గ‌టం ఎంతో సంతోషంగా వుంద‌న్నారు

లోక‌ల్ టాలెంట్ ను ప్రోత్స‌హించే విధంగా ప్ర‌తిరోజు ఒక గంట కార్య‌క్ర‌మాలు వుంటాయ‌న్నారు. శ్రీకాళుం నుంచి త‌ప్పెట గుళ్లు కోదాడ రామారావు బృందంతో కార్య‌క్ర‌మం వుంటుందన్నారు. అనంత‌పురం నుంచి ఉరుములు, అమ‌లాపురం నుంచి వీర‌నాట్యం గ‌ర‌గ‌లు, విజ‌య‌న‌గ‌రం నుంచి పులి వేషాలు, ప‌ద్మావ‌తి యూనివ‌ర్శిటీ నుంచి హ‌రిక‌థ డిపార్టెంట్ ప్రోఫెస‌ర్ తో హ‌రిక‌థ కార్య‌క్ర‌మాలు, స‌ప్పా భార‌తి హ‌రిక‌ధ చెప్ప‌టానికి రావ‌టం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు..తెనాలి నుంచి కాళిక వేషాల కోసం రామ్ ప్ర‌సాద్ , కాకినాడ నుంచి బుర్ర క‌థ‌లు, తొలు బొమ్మ‌లాట‌, క‌త్తి సాము, కర్ర‌సాము వంటి ప్ర‌ద‌ర్శ‌న‌లు విజ‌యవాడ ఉత్స‌వ్ లో ప్ర‌జ‌ల‌కు చూసే అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు.

నాట‌క అకాడ‌మి చైర్మ‌న్ గుమ్మ‌డి గోపాల‌కృష్ణ మాట్లాడుతూ నాట‌కాలు,నాటిక‌లు క‌థ‌ప‌రంగా వుంటాయన్నారు. ప‌ద‌కొండు రోజుల్లో ప‌ద్య‌, సాంఘిక దాదాపు 25 ప్ర‌దర్శించ‌బ‌డ‌తాయ‌న్నారు. ప్ర‌జ‌లంద‌రూ విచ్చేసి క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించాల‌ని పిలుపునిచ్చారు. నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌ల‌న్నీ స‌మ‌యం ప్ర‌కారం ప్ర‌ద‌ర్శించ‌బ‌డ‌తాయ‌న్నారు. తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళా క్షేత్రంలో 13 నాటిక‌లు ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతాయ‌ని, . ఇందులో 7 పౌరాణికాలు, 6 సాంఘిక నాటిక‌లు వుంటాయ‌న్నారు. ఘంట‌సాల మ్యూజిక్ క‌ళాశాలో 12 నాటిక‌లు వుంటాయ‌ని, వాటిలో 7 పౌరాణిక‌లు 5 సాంఘిక నాటిక‌లు రెండు చోట్ల క‌లిపి 25 నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌లు ప్ర‌ద‌ర్శించ‌టం జ‌రుగుతుంద‌న్నారు.

జిజ్ఞాస ఆర్ట్ వ‌ర్క్స్ సంస్థ క్యూరేట‌ర్ వైష్ణ‌వి మాట్లాడుతూ విజ‌య‌వాడ ఉత్స‌వ్ ట్రూలీ పార్టిసెప్టివ్ స్పిరిట్ తో విజ‌య‌వాడ ఉత్స‌వ్ లో ప‌లు పోటీలు నిర్వ‌హిస్తున్నట్లు తెలిపారు.. ఇప్ప‌టికే క్రౌన్ ఆఫ్ విజ‌య‌వాడ లో భాగంగా మిస్ విజ‌య‌వాడ‌, మిసెస్ విజ‌య‌వాడ‌, టీన్ విజ‌య‌వాడ‌, కిడ్ విజ‌య‌వాడ విభాగాలు ఆడిష‌న్స్ జ‌రిగాయన్నారు.. కె.ఎల్ .యూనివ‌ర్శిటీలో ఈనెల 24,25 వ తేదీలో విజ‌య‌వాడ ఐడిల్ కాంపీటీష‌న్స్ జ‌రుగుతాయన్నారు. ఇందులో సోలో డ్యాన్స్, సాంగ్ కాంపీటేష‌న్స్ జ‌రుగుతాయ‌ని వివ‌రించారు.. ఈనెల 24, 25 వ తేదీలో కె.ఎల్. యూనివర్శిటీలోనే విజ‌య‌వాడ ఛామ్ పేరిట గ్రూప్ డ్యాన్స్, గ్రూప్ మ్యూజిక్ పోటీలు జ‌రుగుతాయన్నారు.ఈ నెల‌ 28 వ తేదీ వి.పి సిద్దార్ధ ప‌బ్లిక్ స్కూల్ లో విజ‌య‌వాడ టాలెంట్ క్వ‌స్ట్ జ‌రుగుతుంది ఇందులో ఆర్ట్స్ , క్రాప్ట్స్, క్రియేటివ్ రైటింగ్ పోటీలు నిర్వ‌హిస్తాము..28వ తేదీ వండర్ వుమెన్ ఆఫ్ విజ‌య‌వాడ‌లో మ‌హిళ‌లు పాల్గొన వ‌చ్చు. ఇందులో పండుగ పిండి వంట‌లు, బొమ్మ‌ల కొలువు వంటి పోటీలు వుంటాయి. 29,30 తేదీల్లో విజ‌య‌వ‌డ ఆఫ్ క్విజ్ పేరిట పౌరాణిక ఇతిహాస‌, చారిత్ర‌క‌, సాంఘిక‌, రాజ‌కీయ, సాంస్కృతిక క‌ళ చ‌రిత్ర ల‌కు సంబంధించిన అంశాల‌తో క్విజ్ ఏర్పాటు చేయ‌టం జ‌రిగందన్నారు.

ఇక విజ‌య‌వాడ ఉత్స‌వ్ క‌మిటీ స‌భ్యులు అనిల్ సుంక‌ర మాట్లాడుతూ గేయ ర‌చ‌యిత రామ జోగ‌య్య శాస్త్రి విజ‌య‌వాడ ఉత్స‌వ్ పిలుస్తోంది పాట‌ను చాలా అద్బుతంగా రాశార‌ని కొనియాడారు. విజ‌య‌వాడ ఉత్స‌వ్ కార్య‌క్ర‌మం విజ‌య‌వాడ ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురానుంద‌న్నారు. ఇత‌ర ప్రాంతాలు, దేశాల్లో వున్న విజ‌య‌వాడ వాసులు విజ‌య‌వాడ ఉత్స‌వ్ కి త‌ర‌లిరావాల‌ని పిలుపునిచ్చారు. విజ‌య‌వాడ ఉత్స‌వ్ లో తాను కూడా భాగ‌స్వామ్యం అయినందుకు సంతోషంగా వుంద‌న్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *