Breaking News

“విజయవాడ ఉత్సవ్ – ది వరల్డ్’స్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివల్”

-దసరా సందడి మధ్య విజయవాడ నగరాన్ని కళా, సాంస్కృతిక వైభవంతో అలరించేందుకు సిద్ధమైన “విజయవాడ ఉత్సవ్”.
-సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు నిర్వహణ.
-ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో అదనపు హంగులు.
-నగరంలో 4 ప్రధాన వేదికలు సిద్ధం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా పండుగ సందడి మొదలవుతున్న వేళ విజయవాడ నగరం కళా వైభవంతో అలరించడానికి సిద్ధమవుతోంది. ప్రతీ ఏటా జరిగే ఈ ఉత్సవాలకు ఈసారి ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో నిర్వహిస్తున్న “విజయవాడ ఉత్సవ్” అదనపు హంగులు జోడించింది. “విజయవాడ ఉత్సవ్ – ది వరల్డ్’స్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివల్” పేరుతో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు నగర వాసులు, కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులను అలరించనున్నాయి.

నగరంలో నాలుగు వేదికలు..

ఈసారి నగరంలో నాలుగు ప్రధాన వేదికలు సిద్ధమయ్యాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం, పున్నమి ఘాట్, ఎక్స్‌పో గ్రౌండ్ (గొల్లపూడి), జివిఆర్ గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్. ప్రతి వేదికకీ ఒక ప్రత్యేకత ఉంది. తుమ్మలపల్లి కళాక్షేత్రం సంప్రదాయ కళలకు వేదిక కానుండగా, పునమి ఘాట్ ప్రముఖ గాయకులు, నర్తకుల సందడి చూసే వేదికగా మారనుంది. ఎక్స్‌పో గ్రౌండ్ ఆధునిక వినోదానికి హబ్‌గా మారుతుండగా, జివిఆర్ కళాశాలలో విద్యార్థుల ప్రతిభ ప్రదర్శనలకు వేదిక కల్పించారు.

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేక ప్రదర్శనలు..

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రతిరోజూ కూచిపూడి నృత్యాలు, హరికథ, బుర్రకథ, తోలు బొమ్మలాట, సోషియల్ ప్లేలెట్స్ లాంటి సంప్రదాయ కళారూపాలు ప్రదర్శించబడతాయి. మాజిక్ షోలు, వీరనాట్యం, గరగలు, కలికా వేషాలు వంటి ప్రత్యేక ప్రదర్శనలు కూడా అలరించనున్నాయి.

పున్నమి ఘాట్ వేదికపై మరపురాని అనుభూతి.

పున్నమి ఘాట్ వేదికపై ప్రముఖ గాయకులు, సంగీత విద్వాంసులు, నర్తకులు ఒకరి తర్వాత ఒకరు సందడి చేయనున్నారు. వర్షిణి, అబిజిత్ నిమ్మగడ్డ, కార్తీక్, కాసర్ల శ్రావణి, అనన్య పాండా, నందన్ నారాయణ్ ఇషాన్, కైలాష్ వంటి ప్రముఖుల ప్రదర్శనలు ప్రేక్షకులకు మరపురాని అనుభూతి కలిగించనున్నాయి.

వినోదానికి హబ్ గా గొల్లపూడి ఎక్స్‌పో గ్రౌండ్..

గొల్లపూడి వద్ద ఏర్పాటు చేసిన ఎక్స్‌పో గ్రౌండ్ వినోదానికి హబ్‌గా మారనుంది. మానసా వరణాసి, మణిశర్మ, కార్తీక్, సునీత, రామ్ మిరియాల, గీతా మాధురి, జామ్ జంక్షన్ బ్యాండ్ వంటి గాయకులు, బ్యాండ్స్ తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఫుడ్ ఫెస్టివల్స్, వినోద ప్రదర్శనలు ఈ వేదికలో మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

అక్కడి వేదికపై వినూత్న ప్రదర్శనలు..

జివిఆర్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్‌లో విద్యార్థుల ప్రతిభ ప్రతిరోజూ ప్రతిభావంతమైన ప్రదర్శనల రూపంలో వెలుగులోకి రానుంది. కూచిపూడి, ఆంధ్రనాట్యం, భరతనాట్యం, బుర్రకథ, హరికథతో పాటు మిమిక్రి, హాస్య విన్యాసాలు, జానపద నృత్యాలు, డాల్ డాన్స్, రోబో డాన్స్ వంటి వినూత్న ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించనున్నాయి.

అన్ని ప్యాకేజీగా ఒకే వేదికపై..

సంప్రదాయ కళలు, ఆధ్యాత్మిక వాతావరణం, ఆధునిక సంగీతం, వినోదం అన్ని ప్యాకేజీగా ఒకే వేదికపై ప్రజలకు అందించడం ఈ ఉత్సవం ప్రత్యేకత. విజయవాడ ఉత్సవం ఈసారి ప్రజలకు కేవలం వినోదం మాత్రమే కాకుండా, సాంస్కృతిక అనుభవాన్ని, ఆధ్యాత్మిక స్పర్శను, కళల వైభవాన్ని కలిపిన అద్భుత అనుభూతిని పంచబోతుంది.

11 రోజుల పండుగను ప్రత్యేకంగా రూపొందించిన ఎంపీ శివనాథ్..

ఈ ఏడాది దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ భావించారు. ప్రజల ఆనందం, భక్తుల సౌకర్యం, నగరానికి ఒక సరికొత్త గుర్తింపు కల్పించడం ఈ మూడు లక్ష్యాలను తన ముందుంచుకున్న శివనాథ్, ఈసారి ఉత్సవానికి అదనపు హంగులు జోడించి “విజయవాడ ఉత్సవ్ – ది వరల్డ్’స్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివల్” పేరుతో 11 రోజుల పండుగను ప్రత్యేకంగా రూపొందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *