Breaking News

విజయవాడ ఉత్సవ్ పేరిట ఎవరి వద్ద డబ్బులు వసూలు చేయలేదు.

-దేవదాయశాఖ భూములను అభివృద్ధి మాత్రమే చేసాం.
-ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
-సన్నాహక సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు..
-దసరా ఉత్సవాలంటే మైసూరు తర్వాత విజయవాడ పేరు చెప్పాలి.. ఎంపీ కేశినేని శివనాథ్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ‌: సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో “ఒకే నగరం.. ఒకే ఉత్సవం” నినాదంతో తలపెట్టిన “విజయవాడ ఉత్సవ్” పేరు చెప్పి కమిటీ సభ్యులు ఎవరూ కూడా డబ్బులు వసూలు చేయలేదు. కొందరు ఆరోపిస్తున్నట్లు దేవాదాయ శాఖ భూములను ఆక్రమించే ఆలోచనతో కాదు, అభివృద్ధి చేయాలని మాత్రమే ఎగ్జిబిషన్ ఏర్పాటుకు సంకల్పించాము. ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న అసత్య ప్రచారాలకు గట్టిగా సమాధానం చెప్పాలని కూటమి శ్రేణులకు ఎంపీ శివనాథ్ పిలుపునిచ్చారు.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో భాజపా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షతన “విజయవాడ ఉత్సవ్” పై ఆదివారం జరిగిన సన్నాహక సమావేశంలో ఎంపీ మాట్లాడారు.

ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్న గొల్లపూడి సమీపంలోని దేవాదాయ శాఖ భూములను 56 రోజులకు లీజుకు తీసుకొని, నిబంధనల ప్రకారం రూ. 45 లక్షలు ప్రభుత్వానికి చెల్లించామని, లీజు ముగిసిన వెంటనే ఆ భూములను తిరిగి దేవదాయ శాఖకు అప్పగిస్తామని ఎంపీ పేర్కొన్నారు. ఉత్సవ్ కమిటీ అభివృద్ధి చేసిన భూములను తిరిగి వేరే ఈవెంట్లకు లీజుకి ఇవ్వటం ద్వారా దేవాదాయ శాఖకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఎంపీ తెలిపారు.

పున్నమి ఘాట్ లో ప్రతిరోజు డ్రోన్ షో ఉందని, ఉత్సవాల మొదటి రోజు చివరి రోజు క్రాకర్స్ షో నిర్వహించాలని భావించగా, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వస్తున్న నేపథ్యంలో ఈనెల 24న క్రాకర్స్ షో నిర్వహిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ ఉత్సవాలకు పడవ పందాలు, రాత్రి జరిగే స్నేక్ బోట్ రైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఎంపీ స్పష్టం చేశారు. 11 రోజుల పాటు నిర్విరామంగా 256 కార్యక్రమాలు జరుగుతాయని, గతంలో ఎన్నడు లేని విధంగా ప్రజల భాగస్వామ్యంతో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు.

సుమారు 15 లక్ష మంది వచ్చే విధంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ సిద్ధం చేశారని, జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు 11 రోజులు 11 సినిమా ఈవెంట్లు జరుగుతాయని ఎంపీ పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే ఫుడ్ స్టాళ్లలో కేవలం శాఖాహారం విక్రయాలకు మాత్రమే అనుమతిస్తారని ఎంపీ తెలిపారు.

ఉమ్మడి కృష్ణాజిల్లాలో అతిపెద్ద ఉత్సవాలు రెండు మాత్రమే జరుగుతాయని, వాటిలో ఒకటి మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ కాగా, రెండోది విజయవాడ అమ్మవారి దసరా ఉత్సవాలేనని, విజయవాడకు మరింత ఖ్యాతి తీసుకువచ్చేందుకు ప్రతి ఏటా “విజయవాడ ఉత్సవ్” నిర్వహిస్తామని ఎంపీ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఉత్సవాల్లో పేద కళాకారులను తీసుకువచ్చి, వారికి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఎంపీ చెప్పారు. విజయవాడ నగరం పరిధిలోని కళాకారులకు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు అవకాశం కల్పిస్తామని, పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఈటీవీ ఎంతో మందికి అవకాశం ఇచ్చిన విధంగా ” విజయవాడ ఉత్సవ్ ” కూడా వేదికగా నిలుస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

దసరా ఉత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల్లో కనీసం 50 వేల మంది రెండు రోజులు విజయవాడలో ఉంటే అన్ని వ్యాపార వర్గాలకు ఆదాయం సమకూరుతుందని, ఈ నేపథ్యంలో డిస్కౌంట్ ప్రకటించాలని కోరగా, సానుకూలంగా స్పందించిన వర్తక, వాణిజ్య వ్యాపారులకు ఎంపీ కేశినేని శివనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఏపీ ఆర్య‌వైశ్య మ‌హాస‌భ గౌర‌వ అధ్య‌క్షులు పెనుగొండ సుబ్బారాయుడు, పశ్చిమ నియోజ‌క‌వ‌ర్గ కార్యాల‌య కార్య‌ద‌ర్శి ప్ర‌త్తిపాటి శ్రీద‌ర్, విజ‌య‌వాడ ఉత్స‌వ్ క‌మిటీ స‌భ్యులు ముత్త‌వ‌ర‌పు ముర‌ళీ కృష్ణ‌, టిడిపి కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి బొప్ప‌న భ‌వ‌కుమార్, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌దర్శి ప‌తావుల్లాహ్, ఎన్టీఆర్ జ‌ల్లా వాణిజ్య విభాగ అధ్య‌క్షుడు సొలంకి రాజు, టిడిపి నాయ‌కులు కోగంటి రామారావు, యేదుపాటి రామ‌య్య‌, అలుగుండ్ల సుబ్బారెడ్డి, ప‌త్తి నాగేశ్వ‌ర‌రావు, పి.వి.చిన్న‌సుబ్బ‌య్య, సంతోష్ కుమార్, సుర‌భి బాలు, రేగ‌ళ్ల ల‌క్ష్మ‌ణ రావు , శివ‌శ‌ర్మ‌, బొడ్డుప‌ల్లి శ్రీను ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *