-టిడిపి ఎన్టీఆర్ జిల్లా నేతలు డిమాండ్
-ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం
-దమ్ముంటే పోతిన మహేష్ బహిరంగ చర్చకు రావాలని సవాల్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అంతరించిపోతున్న కళలకు పునర్వైభవం తీసుకువచ్చేందుకు విజయవాడ ఉత్సవ్ ద్వారా ఏంపీ కేశినేని శివనాథ్ ప్రయత్నిస్తుంటే చూసి ఓర్వలేక కళ్లు వుండి చూడలేని కబోధిలా వైసిపి నాయకుడు పోతిన మహేష్ మాట్లాడని ఆయన పై తీవ్ర స్థాయిలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ , ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కరీముల్లా , ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు షేక్ నాగుర్ , టి.ఎన్.ఎస్.ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ మండి పడ్డారు.
ఎంపీ కేశినేని శివనాథ్ పై పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం గురునానక్ కాలనీ లోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కరీముల్లా మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే తాట తీస్తామంటూ హెచ్చరించారు. విజయవాడ వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గ ఎమ్మెల్యేల తో కలిసి విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆ దసరా ఉత్సవాలకు మరింత శోభ తెచ్చే విధంగా ఎంపీ కేశినేని శివనాథ్ చొరవ తో విజయవాడ ఉత్సవ్ జరగనుందన్నారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మోసం చేసిన ఘన చరిత్ర పోతిన మహేష్ సొంతమన్నారు. తాను జనసేన జెండా తప్ప ఇతర జెండా పట్టుకుంటే కుడి చేయి నరికేసుకుంటానని ప్రగల్భాలు పలికిన ఉత్తర కుమారుడన్నారు. పోతిన మహేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మోసం చేసి ఎడమ చేతితో అన్నం తింటున్నాడని ఎద్దేవా చేశారు. ఎడమ చేతితో భోజనం చేసే పోతిన మహేష్ గురించి మాట్లాడం తమ దురదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే జనాలు బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే వుందన్నారు..
ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ పే బ్యాక్ సోసైటీ నినాదం స్పూర్తి తో సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఆశయం తో పనిచేస్తున్నారని తెలిపారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పోతిన మహేష్ కు ఎంపీ కేశినేని శివనాథ్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఎంపీ కేశినేని చేస్తున్న సేవ కార్యక్రమాలు, పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ది పనులు పోతిన మహేష్ కి కనిపించకపోతే తమ దగ్గరికి వస్తే చూపిస్తామన్నారు. దమ్ముంటే మహేష్ కి తమ నలుగురితో ఆయన చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. వంద మంది తెచ్చుకున్న తాము నలుగురం మాత్రమే వచ్చి సమాధానం చెబుతామన్నారు.
తెలుగు యువత ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు షేక్ నాగుర్ మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ కి ప్రపంచ వ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంటే వైసిపి నాయకులు కాలు అడ్డుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోతిన మహేష్ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన వ్యక్తి అన్నారు. గత వైసిపి హయంలో రాష్ట్రంలో ఎన్నో విగ్రహాలు ధ్వంసం కావటంతో పాటు. ఎన్నో రథాలు తగలబడ్డాయన్నార…అమ్మవారి గుడిలో మాయమైన రెండు వెండి విగ్రహాల్లో ఎంత వాట ఇస్తే వైసిపిలో చేరాడో మహేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
*టి.ఎన్.ఎస్.ఎస్.ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో, విజయవాడలో అంతరించిపోతున్న కళలకు పునర్వైభవం తీసుకువచ్చేందుకు విజయవాడ ఉత్సవ్ వేదిక కానుందన్నారు. విజయవాడ వన్ టౌన్ పాత శివాలయం ఆస్తులను ఎవరో అనుభవిస్తున్నారో తెలిసిన పోతిన మహేష్ ఎందుకు వాళ్లని ప్రశ్నించటం లేదో సమాధానం చెప్పాలన్నారు. అందులో పోతిన మహేష్ కి వాట అందుతుంది కాబట్టే ప్రశ్నించటం లేదన్నారు. అమ్మవారి గుడిలో విగ్రహాలు పోతే నానా యాగీ చేసిన మహేష్ ఇప్పుడు వెల్లంపల్లినుంచి ఎంత వాటా అందుకుని మౌనం వున్నాడో సమాధానం చెప్పాలన్నారు. మహాలక్ష్మి చిప్స్ పేరిట ప్రజలను మోసం పోతిన మహేష్ నీతులు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఎంపీ కేశినేని చిన్ని పై విమర్శలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News